విష్ణుకి చెల్లెలిగా కాజల్‌!

Kajal Aggarwal Turns Sister For Manchu Vishnu - Sakshi

యంగ్ హీరో మంచు విష్ణు ఓ హాలీవుడ్ సినిమాలో నటిస్తున్న  సంగతి తెలిసిందే. తెలుగు, ఇంగ్లీష్‌ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మంచు విష్ణుతో పాటు కాజల్‌ అగర్వాల్ కూడా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో కాజల్‌, విష్ణు సరసన హీరోయిన్‌గా నటించటం లేదట. ఈ ఇద్దరు ఈ మూవీలో అన్నా చెల్లెల్లుగా కనిపించనున్నారన్న టాక్‌ వినిపిస్తోంది.

క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అన్నా చెల్లెల్ల పాత్రలు కీలకం కావటంతో విష్ణు, కాజల్‌లు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. త్వరలో ప్రారంభం కానున్న ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరగుతోంది. త్వరలోనే సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top