తాయ్‌.. పురట్చి తలైవి | Jayalalitha's biopic film titled Thaai: Puratchi Thalaivi Tamil Movie | Sakshi
Sakshi News home page

తాయ్‌.. పురట్చి తలైవి

Dec 28 2017 12:18 AM | Updated on Dec 28 2017 12:18 AM

Jayalalitha's biopic film titled Thaai: Puratchi Thalaivi Tamil Movie  - Sakshi

తమిళ రాజకీయాల్లోనే కాదు, సినీ పరిశ్రమలోనూ తనదైన ముద్ర వేసి జయకేతనం ఎగురవేశారు జయలలిత. సీయంగా ఆమెను అభిమానులు ఎంత ఆదరించారో దేశం మొత్తం చూసింది. జయలలిత మరణానంతరం తమిళ రాజకీయాలు ఎన్ని మలుపులు తిరిగాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆమె జీవితం ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ బయోపిక్‌ గురించి నిర్మాతల్లో ఒకరైన ఆదిత్య భరద్వాజ్‌ మాట్లాడుతూ– ‘‘ఓ పబ్లిక్‌ మీటింగ్‌లో జయలలితగారిని కలిశా. బయోపిక్‌ గురించి చెప్పాను.

ఈ విషయంపై తర్వాత మాట్లాడదాం అన్నారామె. కానీ, ఆ తర్వాత మాట్లాడే అవకాశం రాలేదు. ఈలోపు ఏవేవో జరిగిపోయాయి. అప్పుడు అనుకున్న స్క్రిప్ట్‌కి మార్పులు చేశాం. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా తీయబోతున్నాం. స్క్రిప్ట్‌ వర్క్‌ ఆల్మోస్ట్‌ కంప్లీట్‌ అయ్యింది. జనవరి లేక ఫిబ్రవరిలో షూటింగ్‌ స్టార్ట్‌ చేయాలనుకుంటున్నాం. జయలలిత పాత్రను ఎవరు చేస్తారన్న విషయం గురించి ఇప్పుడే చెప్పలేను’’ అన్నారు. ఈ సినిమాకి ‘తాయ్‌: పురట్చి తలైవి’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. అంటే.. అమ్మ: విప్లవ నాయకి’ అని అర్థం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement