breaking news
Aditya Bhardwaj
-
తాయ్.. పురట్చి తలైవి
తమిళ రాజకీయాల్లోనే కాదు, సినీ పరిశ్రమలోనూ తనదైన ముద్ర వేసి జయకేతనం ఎగురవేశారు జయలలిత. సీయంగా ఆమెను అభిమానులు ఎంత ఆదరించారో దేశం మొత్తం చూసింది. జయలలిత మరణానంతరం తమిళ రాజకీయాలు ఎన్ని మలుపులు తిరిగాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆమె జీవితం ఆధారంగా ఓ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ బయోపిక్ గురించి నిర్మాతల్లో ఒకరైన ఆదిత్య భరద్వాజ్ మాట్లాడుతూ– ‘‘ఓ పబ్లిక్ మీటింగ్‌లో జయలలితగారిని కలిశా. బయోపిక్ గురించి చెప్పాను. ఈ విషయంపై తర్వాత మాట్లాడదాం అన్నారామె. కానీ, ఆ తర్వాత మాట్లాడే అవకాశం రాలేదు. ఈలోపు ఏవేవో జరిగిపోయాయి. అప్పుడు అనుకున్న స్క్రిప్ట్‌కి మార్పులు చేశాం. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా తీయబోతున్నాం. స్క్రిప్ట్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది. జనవరి లేక ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. జయలలిత పాత్రను ఎవరు చేస్తారన్న విషయం గురించి ఇప్పుడే చెప్పలేను’’ అన్నారు. ఈ సినిమాకి ‘తాయ్: పురట్చి తలైవి’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. అంటే.. అమ్మ: విప్లవ నాయకి’ అని అర్థం. -
మాస్టర్ ఆదిత్య రికార్డు
ముంబై: రియాన్ ఇంటర్నేషనల్ స్కూలులో పదో తరగతి చదువుతున్న మాస్టర్ ఆదిత్య భరద్వాజ్ ఈతలో రికార్డు సృష్టించాడు. కాసా దీవి నుంచి ఎలిఫెంటాకు నాలుగు గంటల పది నిమిషాల్లో చేరుకున్నాడు. ఈ రెండింటి మధ్యదూరం 19 కిలోమీటర్లు. ప్రముఖ ఈతగాళ్లు సంకేత్ సావంత్, సంతోష్ కుమార్ల మార్గదర్శనంలో ఇందుకోసం ప్రతిరోజూ ఉదయం మూడు గంటలు, సాయంత్రం మూడుగంటల పాటు సాధన చేశాడు. ఈ సందర్భంగా ఆదిత్య మీడియాతో మాట్లాడుతూ కాసా ద్వీపం నుంచి బయల్దేరిన తర్వాత తొలి రెండు గంటలపాటు అనేక అవరోధాలను ఎదుర్కొన్నానన్నాడు. ఇందుకోసం మరింత శ్రమిం చాల్సి వచ్చిందన్నాడు. ఈ ఏడాది చివరిలో జరగనున్న అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనాలనేది తన ఆకాంక్ష అని చెప్పాడు.