ఫాలోయర్స్ ఎవరికి ఎక్కువ? | in bollywood facebook,twitter flowers who's? | Sakshi
Sakshi News home page

ఫాలోయర్స్ ఎవరికి ఎక్కువ?

Dec 8 2015 12:25 AM | Updated on Jul 26 2018 5:23 PM

ఫాలోయర్స్ ఎవరికి ఎక్కువ? - Sakshi

ఫాలోయర్స్ ఎవరికి ఎక్కువ?

గోళ్ల రంగు మార్చుతున్నా.. బాగుందా...? ఇవాళ చాలా బద్ధకంగా ఉంది.. దుప్పటి ముసుగెట్టేశా...!

 చూశారా..
 బ్రేక్‌ఫాస్ట్‌కి నేనివే తింటా...!
 గోళ్ల రంగు మార్చుతున్నా.. బాగుందా...?
 ఇవాళ చాలా బద్ధకంగా ఉంది.. దుప్పటి ముసుగెట్టేశా...!
ఇలాంటి విషయాలు ఎవరు చెప్పినా వినడానికి  మామూలుగా ఉంటుంది. అదే అందాల తారలు చెబితే అదేదో అద్భుతం విన్నట్లుగా ఉంటుంది.

చెప్పడంతో పాటు ఫొటోలు కూడా బయటపెడితే కనువిందుగా ఉంటుంది. ఇలాంటివి తెలుసుకోవడానికీ, చూడ్డానికీ సినిమా తారలను ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులు ఫాలో అవుతుంటారు. క్రేజ్ ఉన్నవాళ్ల ఫేస్‌బుక్, ట్విట్టర్లకు బోల్డంత మంది ఫాలోయర్లు ఉంటారు. తారలు పంచుకునే కబుర్లు తెలుసుకుని మురిసిపోతుంటారు. అడపా దడపా ఫాలోయర్లకు తారలు వరం ఇస్తుంటారు.

‘మీరు ప్రశ్నలడిగితే నేను సమాధానం చెబుతా.. కమాన్ రెడీ’ అంటూ ట్విట్టర్, ఫేస్‌బుక్ ద్వారా చాట్ చేస్తుంటారు. అలా హిందీ రంగంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే తారల గురించి చెప్పాలంటే.. ప్రియాంకా చోప్రా, దీపికా పదుకొనే, సోనాక్షీ సిన్హా, సోనమ్ కపూర్, పరిణీతి చోప్రా, శ్రద్ధాకపూర్ వంటివాళ్లు నిరాటంకంగా ఏదో ఒక వార్త పోస్ట్ చేస్తూ, అభిమానులను ఆనందపరుస్తుంటారు.

వీళ్లల్లో ఎవరెవరికి ఎంతమంది ఫాలోయర్స్ ఉన్నారనే విషయానికొస్తే... ఫేస్‌బుక్‌లో దీపికా పదుకొనేకే ఎక్కువమంది ఫాలోయర్స్ ఉన్నారు. దాదాపు 2 కోట్ల 90 లక్షల మంది ఫాలోయర్స్ ఉన్నారు. సో.. ఆమెదే అగ్రస్థానం. 2 కోట్ల మంది ఫాలోయర్స్‌తో సోనాక్షీ సిన్హా రెండో స్థానంలో ఉన్నారు. అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’ ద్వారా మరింత క్రేజ్ తెచ్చుకున్న ప్రియాంకకు ఈ ఇద్దరికన్నా ఎక్కువమంది ఫాలోయర్స్ ఉండాలి.

కానీ, ఆమె ఖాతాలో ఉన్నది 1 కోటీ 70 లక్షల మంది మాత్రమే. అందుకే మూడో స్థానంలో ఉన్నారు. 1 కోటీ 30 లక్షల మంది ఫాలోయర్స్‌తో నాలుగో స్థానంలో సోనమ్ కపూర్, 90  లక్షల మందితో శ్రద్ధాకపూర్ ఐదో స్థానంలో నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement