'ఇలాంటి భర్త నాకొద్దు.. మీడియా అర్ధం చేసుకోవాలి' | Harvey Weinstein's wife announces split amid mounting sex abuse scandal | Sakshi
Sakshi News home page

'ఇలాంటి భర్త నాకొద్దు.. మీడియా అర్ధం చేసుకోవాలి'

Oct 11 2017 12:07 PM | Updated on Jul 23 2018 8:49 PM

 Harvey Weinstein's wife announces split amid mounting sex abuse scandal  - Sakshi

హార్వే వెయిన్‌స్టన్‌(65), ఫ్యాషన్‌ డిజైనర్‌ జార్జియానా చాప్‌మన్‌(41)

న్యూయార్క్‌ : హాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత హార్వే వెయిన్‌స్టన్‌(65)కు మరో గట్టి షాక్‌ ఎదురైంది. ఆయనను విడిచిపెట్టి వెళుతున్నట్లు భార్య ఫ్యాషన్‌ డిజైనర్‌ జార్జియానా చాప్‌మన్‌(41) ప్రకటించింది. ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న హార్వేపై హాలీవుడ్‌లోని నటీమణులంతా ఏకకాలంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తమపై లైంగిక వేధింపులకు పాల్పడేందుకు ప్రయత్నించారని కొందరు, లైంగిక దాడి చేశారని ఇంకొందరు ఆయనపై కేసులు పెట్టగా తాజాగా ప్రముఖ నటి ఏంజెలినా జోలి, గైనెత్‌ పాల్ట్రో వంటి నటీమణులు కూడా పెదవి విప్పారు. తమపై కూడా ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బయటి ప్రపంచానికి తెలియజేశారు. ఈ విషయాన్ని న్యూయార్కర్‌ మేగజిన్‌, డెయిలీ న్యూస్‌ ముఖచిత్రంతో పెద్ద స్టోరిని వేసింది.

దీంతో తారా స్థాయిలో ఈ అంశంపై చర్చ జరుగుతుండగా ఇలాంటి షాకింగ్‌ విషయాలు తెలిసిన తర్వాత తాను ఇక ఆయనతో ఏమాత్రం ఉండబోనని హార్వే భార్య చాప్‌మన్‌ ప్రకటించారు. 2007లో ఆయనను వివాహం చేసుకున్న చాప్‌మన్‌ ఆరు రోజులపాటు మౌనంగా ఉండి చివరకు ఆయనతో విడిపోతున్నట్లు ప్రకటించి షాకిచ్చింది. తొలుత ఆయనకు ఆమె మద్దతిస్తూ వచ్చినప్పటికీ ఆమె ఫ్యాషన్‌ లేబుల్‌ మార్చెసాను అంతా బహిష్కరించండి అంటూ ప్రజలు పిలుపునివ్వడంతో ఇక ఆమె వేరే దారి లేక ఆయనతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. 'మహిళలందరి తరుపున నా హృదయం రోధిస్తోంది. ఇలాంటి క్షమించరాని చర్యలకు బాధితులైన వారిని చూసి నేను బాధపడుతున్నాను. నేను ఇక నా భర్తను విడిచిపెట్టాలని అనుకుంటున్నాను. నా పిల్లలను చూసుకోవడమే నాకున్న తొలి ప్రాధాన్య అంశం. ఇలాంటి సమయంలో దయచేసి నాకు కొంత ప్రైవసీ ఇవ్వండని మీడియాను వేడుకుంటున్నాను' అని ఆమె చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement