breaking news
wife divorced
-
'ఇలాంటి భర్త నాకొద్దు.. మీడియా అర్ధం చేసుకోవాలి'
న్యూయార్క్ : హాలీవుడ్ ప్రముఖ నిర్మాత హార్వే వెయిన్‌స్టన్(65)కు మరో గట్టి షాక్ ఎదురైంది. ఆయనను విడిచిపెట్టి వెళుతున్నట్లు భార్య ఫ్యాషన్ డిజైనర్ జార్జియానా చాప్మన్(41) ప్రకటించింది. ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న హార్వేపై హాలీవుడ్‌లోని నటీమణులంతా ఏకకాలంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తమపై లైంగిక వేధింపులకు పాల్పడేందుకు ప్రయత్నించారని కొందరు, లైంగిక దాడి చేశారని ఇంకొందరు ఆయనపై కేసులు పెట్టగా తాజాగా ప్రముఖ నటి ఏంజెలినా జోలి, గైనెత్ పాల్ట్రో వంటి నటీమణులు కూడా పెదవి విప్పారు. తమపై కూడా ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బయటి ప్రపంచానికి తెలియజేశారు. ఈ విషయాన్ని న్యూయార్కర్ మేగజిన్, డెయిలీ న్యూస్ ముఖచిత్రంతో పెద్ద స్టోరిని వేసింది. దీంతో తారా స్థాయిలో ఈ అంశంపై చర్చ జరుగుతుండగా ఇలాంటి షాకింగ్ విషయాలు తెలిసిన తర్వాత తాను ఇక ఆయనతో ఏమాత్రం ఉండబోనని హార్వే భార్య చాప్మన్ ప్రకటించారు. 2007లో ఆయనను వివాహం చేసుకున్న చాప్మన్ ఆరు రోజులపాటు మౌనంగా ఉండి చివరకు ఆయనతో విడిపోతున్నట్లు ప్రకటించి షాకిచ్చింది. తొలుత ఆయనకు ఆమె మద్దతిస్తూ వచ్చినప్పటికీ ఆమె ఫ్యాషన్ లేబుల్ మార్చెసాను అంతా బహిష్కరించండి అంటూ ప్రజలు పిలుపునివ్వడంతో ఇక ఆమె వేరే దారి లేక ఆయనతో తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించింది. 'మహిళలందరి తరుపున నా హృదయం రోధిస్తోంది. ఇలాంటి క్షమించరాని చర్యలకు బాధితులైన వారిని చూసి నేను బాధపడుతున్నాను. నేను ఇక నా భర్తను విడిచిపెట్టాలని అనుకుంటున్నాను. నా పిల్లలను చూసుకోవడమే నాకున్న తొలి ప్రాధాన్య అంశం. ఇలాంటి సమయంలో దయచేసి నాకు కొంత ప్రైవసీ ఇవ్వండని మీడియాను వేడుకుంటున్నాను' అని ఆమె చెప్పారు. -
మేకప్ లేకుండా తొలిసారి భార్యను చూసి...
పెళ్లి చూపులలోను, పెళ్లిలోను కూడా అమ్మాయిలకు మేకప్ చేసి చూపించడం సర్వసాధారణం. అయితే అది ఒక మాదిరిగా ఉంటే పర్వాలేదు గానీ.. ఏకంగా పూర్తిగా రూపాన్నే మార్చేసేలా ఉంటే కష్టమే. తన భార్యను మేకప్ లేకుండా మొట్టమొదటిసారి చూసిన ఓ అమాయకుడు.. ఆమెను గుర్తుపట్టలేకపోయాడు. చివరకు తాను ఎంతో ముచ్చటపడి పెళ్లి చేసుకున్న భార్య ఈమేనా అని బాధపడి.. ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఈ ఘటన యూఏఈలో చోటుచేసుకుంది. కొత్తగా పెళ్లయిన జంటలోని సదరు మహిళామణి.. సరదాగా స్విమ్మింగ్‌కు వెళ్లి వచ్చేసరికి ఆమె వేసుకున్న మేకప్ మొత్తం చెరిగిపోయింది. షార్జాలోని అల్ మంజార్ బీచ్‌లో ఇద్దరూ కలిసి స్విమ్మింగ్ చేశారు. అది ముగిసిన తర్వాత ఆమె అసలు రూపం బయటపడింది. నకిలీ కనురెప్పలతో సహా అనేక రకాల మేకప్ సామగ్రి వాడితేనే ఆమె తనకు మామూలుగా కనిపించిందని, తీరా చూస్తే ఆమె అసలురంగు తెలిసిందని సదరు భర్త వాపోయాడు. దాంతో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. కానీ విడాకులు తీసుకున్న తర్వాత తన మానసిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదంటూ ఆమె డాక్టర్ అబ్దుల్ అజీజ్ అసఫ్ అనే సైకాలజిస్టు వద్దకు వెళ్లింది. ఆమె కృత్రిమ కనురెప్పలు పెట్టుకోవడంతో పాటు పెళ్లికి ముందు పలురకాల కాస్మొటిక్ సర్జరీలు చేయించుకుంది. తాను భర్తకు వాస్తవం ఏంటో చెబుదామని అనుకున్నాను గానీ అప్పటికే బాగా ఆలస్యమైందని చెప్పింది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అతడు ఆమెకు విడాకులు ఇచ్చేశాడట.