మేకప్ లేకుండా తొలిసారి భార్యను చూసి... | Man divorces wife after seeing her first time without make-up | Sakshi
Sakshi News home page

మేకప్ లేకుండా తొలిసారి భార్యను చూసి...

Oct 19 2016 3:51 PM | Updated on Sep 4 2017 5:42 PM

మేకప్ లేకుండా తొలిసారి భార్యను చూసి...

మేకప్ లేకుండా తొలిసారి భార్యను చూసి...

తన భార్యను మేకప్ లేకుండా మొట్టమొదటిసారి చూసిన ఓ అమాయకుడు.. ఆమెను గుర్తుపట్టలేకపోయాడు.

పెళ్లి చూపులలోను, పెళ్లిలోను కూడా అమ్మాయిలకు మేకప్ చేసి చూపించడం సర్వసాధారణం. అయితే అది ఒక మాదిరిగా ఉంటే పర్వాలేదు గానీ.. ఏకంగా పూర్తిగా రూపాన్నే మార్చేసేలా ఉంటే కష్టమే. తన భార్యను మేకప్ లేకుండా మొట్టమొదటిసారి చూసిన ఓ అమాయకుడు.. ఆమెను గుర్తుపట్టలేకపోయాడు. చివరకు తాను ఎంతో ముచ్చటపడి పెళ్లి చేసుకున్న భార్య ఈమేనా అని బాధపడి.. ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఈ ఘటన యూఏఈలో చోటుచేసుకుంది. కొత్తగా పెళ్లయిన జంటలోని సదరు మహిళామణి.. సరదాగా స్విమ్మింగ్‌కు వెళ్లి వచ్చేసరికి ఆమె వేసుకున్న మేకప్ మొత్తం చెరిగిపోయింది. షార్జాలోని అల్ మంజార్ బీచ్‌లో ఇద్దరూ కలిసి స్విమ్మింగ్ చేశారు. అది ముగిసిన తర్వాత ఆమె అసలు రూపం బయటపడింది.

నకిలీ కనురెప్పలతో సహా అనేక రకాల మేకప్ సామగ్రి వాడితేనే ఆమె తనకు మామూలుగా కనిపించిందని, తీరా చూస్తే ఆమె అసలురంగు తెలిసిందని సదరు భర్త వాపోయాడు. దాంతో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. కానీ విడాకులు తీసుకున్న తర్వాత తన మానసిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదంటూ ఆమె డాక్టర్ అబ్దుల్ అజీజ్ అసఫ్ అనే సైకాలజిస్టు వద్దకు వెళ్లింది. ఆమె కృత్రిమ కనురెప్పలు పెట్టుకోవడంతో పాటు పెళ్లికి ముందు పలురకాల కాస్మొటిక్ సర్జరీలు చేయించుకుంది. తాను భర్తకు వాస్తవం ఏంటో చెబుదామని అనుకున్నాను గానీ అప్పటికే బాగా ఆలస్యమైందని చెప్పింది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అతడు ఆమెకు విడాకులు ఇచ్చేశాడట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement