జీవీ హాలీవుడ్‌ ఎంట్రీ షురూ | Sakshi
Sakshi News home page

జీవీ హాలీవుడ్‌ ఎంట్రీ షురూ

Published Tue, Sep 24 2019 7:43 AM

GV Prakash Kumar To Make Hollywood Debut - Sakshi

యువ సంగీతదర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్‌కుమార్‌ హాలీవుడ్‌ ఎంట్రీ షురూ అయ్యింది. కోలీవుడ్‌లో వెయిల్‌ చిత్రం ద్వారా సంగీతదర్శకుడిగా పరిచయమయ్యి అతి పిన్న వయసు సంగీత దర్శకుడిగా పేరొందారు జీవీ. ఇక డార్లింగ్‌ చిత్రంతో హీరోగా తెరపైకి వచ్చారు. ఈ తర్వాత సంగీతం, నటన అంటూ రెండు పడవల ప్రయాణాన్ని సక్సెస్‌పుల్‌గా కొనసాగిస్తున్నారు. తాజాగా నటుడిగా కోలీవుడ్‌ నుంచి ఏకంగా హాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ‘ట్రాప్‌ సిటీ’అనే హాలీవుడ్‌ చిత్రంలో జీవీ ప్రకాశ్‌కుమార్‌ నటించనున్నారు. దీనికి బాలీవుడ్‌ దర్శకుడు నిక్కీ బ్రూచ్చల్‌ దర్శకత్వం విహించనున్నారు. దీన్ని కైబా అనే హాలీవుడ్‌ చిత్ర నిర్మాణ సంస్థపై టెల్‌ గణేశన్‌ నిర్మించనున్నారు. ఈయన ఇంతకు ముందు నటుడు నెపోలియన్‌ ప్రధాన పాత్రలో నటించిన వెవిల్స్‌ నైట్, క్రిస్మస్‌ కూపన్‌ వంటి హాలీవుడ్‌ చిత్రాలను నిర్మించారు.

కాగా జీవీ నటించనున్న చిత్రంలో ప్రముఖ హాలీవుడ్‌ నటుడు బ్రాండన్‌ టీ.జాక్సన్‌ ముఖ్య పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెళ్లడించనున్నట్లు చిత్ర వర్గాలు తెలిపారు. జీవీ.ప్రకాశ్‌కుమార్‌ ప్రస్తుతం పలు తమిళ చిత్రాలతో బిజీగా ఉన్నా రు. ఆయన నటించిన 100% కాదల్‌ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. అదే విధంగా ఐన్‌గరన్, అడంగాదే, జెయిల్‌ చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. ప్రస్తుతం బ్యాచ్చిలర్, ఆయిరం జన్మంగళ్,కాదలిక్క యారుమిల్‌లై చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. ఇక సంగీత దర్శకుడిగానూ ధనుష్, దర్శకుడు వెట్రిమారన్‌ కాంభినేషన్‌లో తెరకెక్కుతున్న అసురన్, సూర్య దర్శకురాలు సుధ కొంగరల కాంభినేషన్‌లో రూపొందుతున్న సూరరై పోట్రు చిత్రాలకు పని చేస్తున్నారు. కాగా కోలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌కు వెళ్లిన ధనుష్‌ వంటి అతి కొద్ది మంది నటుల సరసన ఇప్పుడు జీవీ ప్రకాశ్‌కుమార్‌ చేరనున్నారన్నమాట. 

 
Advertisement
 
Advertisement