ఆ నలుగురూ చిత్ర పరిశ్రమను చంపేస్తున్నారు | four producers ruling industry | Sakshi
Sakshi News home page

ఆ నలుగురూ చిత్ర పరిశ్రమను చంపేస్తున్నారు

Mar 8 2014 12:40 AM | Updated on Sep 2 2017 4:27 AM

ఆ నలుగురూ చిత్ర పరిశ్రమను చంపేస్తున్నారు

ఆ నలుగురూ చిత్ర పరిశ్రమను చంపేస్తున్నారు

‘‘థియేటర్ల లీజులు లక్షల్లో దండుకుంటూ పన్నులు కట్టకుండా ఓ నలుగురు బడా నిర్మాతలు చిత్ర పరిశ్రమను చంపేస్తున్నారు. చిరంజీవిని అడ్డం పెట్టుకుని బార్క్ సంస్థ ద్వారా 400 ప్రొజెక్టర్లు వ్యక్తిగత వినియోగం కోసమని చెప్పి సురేష్‌బాబు, అల్లు అరవింద్ 400 థియేటర్లకు ఉపయోగిస్తున్నారు’’ అని నిర్మాత నట్టి కుమార్ ఆరోపించారు.

 ‘‘థియేటర్ల లీజులు లక్షల్లో దండుకుంటూ పన్నులు కట్టకుండా ఓ నలుగురు బడా నిర్మాతలు చిత్ర పరిశ్రమను చంపేస్తున్నారు. చిరంజీవిని అడ్డం పెట్టుకుని బార్క్ సంస్థ ద్వారా 400 ప్రొజెక్టర్లు వ్యక్తిగత వినియోగం కోసమని చెప్పి సురేష్‌బాబు, అల్లు అరవింద్ 400 థియేటర్లకు ఉపయోగిస్తున్నారు’’ అని నిర్మాత నట్టి కుమార్ ఆరోపించారు. దీనిపై గవర్నర్‌కు వినతి పత్రం ఇవ్వనున్నట్లు శుక్రవారం విలేకర్లతో చెప్పారు. తరుణ్‌తో తాను తీసిన ‘యుద్ధం’ విడుదలకు అనేక అవరోధాలు ఎదుర్కొంటున్నానని, ఈ సినిమా ఈ నెల 14న విడుదల కాని పక్షంలో శాశ్వతంగా చిత్ర నిర్మాణ రంగం నుంచి తప్పుకుంటానని నట్టి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement