చరణ్‌కి హిట్‌ ఇవ్వలేకపోయానని బాధపడుతున్నా

Even though Charan is unable to make a hit: nagababu - Sakshi

‘‘సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటున్న టైమ్‌లో అరవింద్‌గారు ‘నువ్వు నిర్మాతగా మళ్లీ సినిమా చేయాలి’ అన్నారు.  నాకు అవసరమా అనిపించింది. బన్నీ కూడా ‘మీరు సినిమా చేయాలి’ అని అడగ్గానే ఆలోచించా. లగడపాటి శ్రీధర్‌గారితో ఇదివరకే వర్క్‌ చేశాను. అప్పటికే బన్నీ సినిమాకు కావల్సినవన్నీ రెడీ చేసుకున్నారు. సో.. నా పని తేలికైపోయింది. మళ్లీ సినిమాలు చేయాలనే ధైర్యం ఇచ్చింది మాత్రం అరవింద్‌గారే’’ అన్నారు నాగబాబు. అల్లు అర్జున్, అన్యూ ఇమ్మాన్యుయేల్‌ జంటగా వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నా పేరు సూర్య–నా ఇల్లు ఇండియా’. నాగబాబు సమర్పణలో లగడపాటి శిరీషా శ్రీధర్‌ నిర్మించారు. ‘బన్నీ’వాసు సహనిర్మాత. ఈ చిత్రం మే 4న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా నాగబాబు చెప్పిన విశేషాలు.

∙‘ఆరెంజ్‌’ సినిమాతో నిర్మాతగా వచ్చిన నష్టం కంటే చరణ్‌కు హిట్‌ ఇవ్వలేకపోయానని ఎక్కువగా బాధపడ్డాను. ‘మగధీర’ వంటి సూపర్‌ హిట్‌ తర్వాత హిట్‌ ఇవ్వలేదని ఫిల్మ్‌ మేకర్‌గా అన్‌ఫిట్‌ అని ఫీల్‌ అయ్యాను. అందుకే నిర్మాణానికి దూరంగా ఉండి సీరియల్స్, షోస్‌ చేస్తున్నాను. కొన్నిసార్లు అనిపిస్తుంది. ‘ఆరెంజ్‌’ ఇప్పుడు రిలీజ్‌ అయ్యుంటే హిట్‌ అయ్యేదేమో అని. 

∙‘నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా’లో బన్నీ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. ఫుల్‌ సీరియస్‌గా, నిబద్ధతతో ఉండే పాత్ర.  తన సీరియస్‌నెస్‌ వల్ల కుడా కొంచెం కామెడీ క్రియేట్‌ అవుతుంది. దాసరిగారి దగ్గర దర్శకుడు వంశీ పనిచేసినప్పటినుంచి తెలుసు. మంచి ఎమోషన్స్‌తో ప్రేక్షకులకు సినిమాని కనెక్ట్‌ చేయించగలడు. తన తదుపరి సినిమా కూడా మా కాంపౌండ్‌లోనే ఉంటుంది. స్టార్‌ హీరోల సినిమాలు ప్లాన్‌ ప్రకారం జరుగుతుంటాయి. అప్పుడప్పుడు మాత్రమే నేను సెట్స్‌కి వెళ్లాను. అంతా ‘బన్నీ’వాసు చూసుకున్నాడు. సినిమా రిలీజ్‌ కాకముందే నెగటివ్‌ టాక్‌ ప్రచారం చేయడం బాధగా అనిపించింది. అరవింద్‌గారు, నేను బాగా హర్ట్‌ అయ్యాం. 

∙నా కెరీర్‌లో ఇది బెస్ట్‌ ఫేజ్‌ అనొచ్చు. మా అబ్బాయి వరుణ్‌ సక్సెస్‌లో ఉన్నాడు. నిహారిక మంచి రోల్స్‌తో కెరీర్‌ ప్లాన్‌ చేసుకుంటోంది. నేను ‘జబర్దస్త్‌’ షో జడ్జిగా బిజీగా ఉన్నా. ఈ ఫేజ్‌ ఇలానే ఉండాలనుకుంటున్నా. వరుణ్‌తో సినిమా ప్లాన్‌ చేయలేదు. ఫ్యూచర్‌లో వాడితో సిని మా చేయొచ్చేమో. వరుణ్‌ ఇమేజ్‌ను క్యాష్‌ చేసుకోవాలనుకోవడం లేదు.  వరుణ్‌ బయట ప్రొడ్యూసర్స్‌కి అందుబాటులో ఉండాలి. వరుణ్‌తో కలిసి యాక్ట్‌ చేయడం గురించి నిర్ణయించుకోలేదు. 

∙రిలీజ్‌ అయిన మూడు వారాలకే సినిమా డిజిటల్‌ ఫ్లాట్‌ఫార్మ్స్‌లో రావడం వల్ల సినిమాకు ఇబ్బంది ఉండదు. మూడు వారాలకు ఆడియన్స్‌ అందరూ సినిమా చూసేస్తారు. ప్రస్తుతం  సినిమాలకు త్రీ వీక్స్‌ మించి లైఫ్‌ ఉండటంలేదు కూడా. 

∙ఇండస్ట్రీ న్యూస్‌ చానెల్స్‌ని బంద్‌ చేస్తోంది అని వినపడుతోంది. ఆ ఆలోచన మాకు లేదు. ఇండస్ట్రీకు ఎలాంటి మంచి పనులు చేయాలని డిస్కస్‌ చేసుకున్నాం. మా ఫ్యాన్స్‌ను అనవసరమైన విషయాల మీద రియాక్ట్‌ అవ్వొద్దని చెబుతున్నాం. ప్రతి ఒక్కరు పబ్లిసిటీ కోసం వాగి, ఆ తర్వాత మీ ఫ్యాన్స్‌ని కంట్రోల్‌ చేసుకొమ్మని సలహా ఇస్తున్నారు. అది ఎంతవరకు సమంజసమో వాళ్లకే తెలియాలి.

∙ఎన్టీఆర్‌–త్రివిక్రమ్‌ సినిమాల్లో ఓ కీ రోల్‌ చేస్తున్నా. విజయ్‌ దేవరకొండ హీరోగా పరుశురామ్‌ తీస్తున్న సినిమాలో కుడా యాక్ట్‌ చేస్తున్నాను. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top