ముక్కోణపు ప్రేమకథ | Etu Vaipo Nee Parugu movie launch | Sakshi
Sakshi News home page

ముక్కోణపు ప్రేమకథ

Nov 3 2018 5:44 AM | Updated on Nov 3 2018 5:44 AM

Etu Vaipo Nee Parugu movie launch - Sakshi

హీరోలు, హీరోయిన్‌పై క్లాప్‌ ఇస్తున్న భీమనేని

క్రాంతి, పృథ్వీ హీరోలుగా, అవంతిక హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎటువైపో నీ పరుగు’. మద్దినేని రమేష్‌ బాబు దర్శకత్వంలో సాయిశాన్వి క్రియేషన్స్‌ పతాకంపై వి.అలేఖ్య, పి.రాంబాబు  నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. హీరోహీరోయిన్లపై తీసిన తొలి సన్నివేశానికి నిర్మాత దామోదరప్రసాద్, డైరెక్టర్‌ శ్రీవాస్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయగా, డైరెక్టర్‌ భీమనేని శ్రీనివాసరావు క్లాప్‌ ఇచ్చారు. మరో దర్శకుడు వి.సాగర్‌ గౌరవ దర్శకత్వం వహించారు. మద్దినేని రమేష్‌ బాబు మాట్లాడుతూ– ‘‘ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి మధ్య సాగే ముక్కోణపు ప్రేమకథా థ్రిల్లర్‌ చిత్రమిది. హైదరాబాద్, వైజాగ్‌లలో షూటింగ్‌ జరుపుతాం. డిసెంబర్‌కి చిత్రీకరణ పూర్తిచేసి, ఫిబ్రవరిలో సినిమా విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ‘‘మంచి కథాబలం ఉన్న ఈ చిత్రంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు పృ«థ్వీ, క్రాంతి. అవంతిక, చదలవాడ శ్రీనివాసరావు, పోకూరి బాబూరావు, కల్యాణ్‌కృష్ణ, టి.ప్రసన్నకుమార్, సంగీత దర్శకుడు వి.కిరణ్‌ కుమార్, మాటల రచయితలలో ఒకరైన శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్‌ మన్నం.
 

Advertisement
 
Advertisement
Advertisement