డబుల్ ట్రీట్ ఇస్తున్న ఎన్టీఆర్ | double dhamaka for Ntr Fans | Sakshi
Sakshi News home page

డబుల్ ట్రీట్ ఇస్తున్న ఎన్టీఆర్

May 15 2016 1:26 PM | Updated on Sep 4 2017 12:10 AM

డబుల్ ట్రీట్ ఇస్తున్న ఎన్టీఆర్

డబుల్ ట్రీట్ ఇస్తున్న ఎన్టీఆర్

టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాల సక్సెస్తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫుల్ జోష్లో ఉన్నాడు. ఇప్పటికే జనతా గ్యారేజ్ షూటింగ్లో పాల్గొంటున్న జూనియర్, శరవేగంగా షూటింగ్ పనులు...

టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాల సక్సెస్తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫుల్ జోష్లో ఉన్నాడు. ఇప్పటికే జనతా గ్యారేజ్ షూటింగ్లో పాల్గొంటున్న జూనియర్, శరవేగంగా షూటింగ్ పనులు కానిచ్చేస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు సినిమాకు సంబందించి అఫీషియల్గా ఒక్క లుక్ కూడా బయటికి రిలీజ్ చేయని చిత్రయూనిట్ ఈ నెలలో అభిమానులుకు రెండు గిఫ్ట్లు ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.

ప్రస్తుతం షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న జనతా గ్యారేజ్ యూనిట్ ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేయడానికి ముహుర్తం ఫిక్స్ చేసింది. అంతేకాదు ఈ నెల 28న సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జనతా గ్యారేజ్ ఫస్ట్ టీజర్ను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. షూటింగ్ కార్యక్రమాలను వీలైనంత త్వరగా ముగించి ఆగస్టులో సినిమా రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నారు యూనిట్.

కొరటాల శివ దర్శకత్వంలో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్తో పాటు మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటిస్తుండగా, సమంత, నిత్యామీనన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement