ఈ సినిమాతో దీపికకు అవార్డు ఖాయం

Deepika Will Win National Award Says Himesh Reshammiya - Sakshi

బాలీవుడ్‌ హీరోయిన్‌ దీపిక పదుకునే తాజాగా నటిస్తున్న చిత్రం ఛపాక్‌. ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరందుకున్నాయి. అందులో భాగంగా దీపిక ఓ ప్రఖ్యాత టీవీ షోకు హాజరయ్యారు. ఆ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న సింగర్‌ హిమేశ్‌ రష్మియాతో కలిసి దీపిక సందడి చేశారు. దీపిక తొలిసారిగా హిమేశ్‌ రష్మియాతో కలిసి నామ్‌ హై తేరా అనే మ్యూజిక్‌ ఆల్బమ్‌లో కనిపించిన సంగతి తెలిసిందే. అందులో హిమేశ్‌ పాడుతూ ఉంటే దీపిక వెనకాల డ్యాన్స్‌ చేస్తూ కనిపిస్తుంటుంది. సరిగ్గా పదమూడేళ్ల తర్వాత తిరిగి స్టేజీపై హిమేశ్‌ మళ్లీ ఆ పాటను ఆలపించగా దీపిక కాళ్లు కదిపారు.

అనంతరం దీపికతో కలిసి దిగిన ఫొటోను హిమేశ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ‘ఛపాక్‌ సినిమాతో దీపిక జాతీయ అవార్డు అందుకోవడం ఖాయం. ఆమె ఎంతో తెలివైనది, నామ్‌ హై తేరా నుంచి ఛపాక్‌ వరకు ఎంతో కష్టపడింది. ఆమెను చూసి గర్వపడుతున్నాను. దర్శకురాలు మేఘనా గుల్జార్‌కు హ్యాట్సాఫ్‌. ట్రైలర్‌ ఎంతో బాగుంది. సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నాను’ అని పేర్కొన్నాడు. కాగా ‘ఛపాక్‌’ జనవరి 10న విడుదల కానుంది. ఇటీవలే ఈ సినిమా ఎలాంటి కోతలు లేకుండా యు సర్టిఫికెట్‌ అందుకుంది. భయంకరమైన యాసిడ్‌ దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

చదవండి: ఛపాక్‌: ధైర్య ప్రదాతలు

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top