క‌రోనా నుంచి కోలుకున్న న‌టి త‌ల్లి | Deepika Singh Mother Recovers From Coronavirus | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ను జ‌యించిన న‌టి త‌ల్లి

Jun 25 2020 3:39 PM | Updated on Jun 25 2020 4:01 PM

Deepika Singh Mother Recovers From Coronavirus - Sakshi

టీవీ న‌టి దీపికా సింగ్ త‌ల్లి కోవిడ్‌ను జ‌యించారు. ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఆమె ప్ర‌స్తుతం పూర్తి ఆరోగ్యంగా ఉన్న‌ట్లు న‌టి వెల్ల‌డించింది. ఈ సంద‌‌ర్భంగా సోష‌ల్ మీడియాలో త‌న త‌ల్లి, నాన‌మ్మ‌తో క‌లిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. అయితే ఇది పాత ఫొటో కాగా, త‌న త‌ల్లి కోలుకునేందుకు కార‌ణ‌మైనవా‌రికీ, త‌న‌కు మ‌ద్ద‌తు తెలిపిన‌వారికి న‌టి కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. "అమ్మ‌ తిరిగి ఇంటికి చేరుకుంద‌"ని సంతోషం వ్య‌క్తం చేసింది. అయితే ఆమె నాన‌మ్మ మాత్రం కోవిడ్‌తో ఇంకా పోరాడుతూనే ఉంది. (నటి అభ్యర్థన.. ప్రభుత్వం స్పందన)

ఈ విష‌యాన్ని న‌టి ప్ర‌స్తావిస్తూ నాన‌మ్మ ఇంకా ఆసుప‌త్రిలో చికిత్స తీసుకుంటోంద‌ని, ఆమె కోసం ప్రార్థిస్తున్నామ‌ని తెలిపింది. కాగా దీపిక సింగ్ త‌ల్లి కోవిడ్ పాజిటివ్ అని తేలాక ఆసుప‌త్రుల చుట్టూ తిరిగిన‌ప్ప‌టికీ బెడ్డు దొర‌క‌ని విష‌యం తెలిసిందే. దీంతో ఆమె సాయం కోరుతూ వీడియో చేయ‌డం, ఇది ప్ర‌భుత్వం దృష్టికి రారావ‌డంతో వెంట‌నే అధికారులు ఢిల్లీలోని శ్రీ గంగా రామ్ ఆసుప‌త్రిలో అడ్మిష‌న్ ఇచ్చి అండ‌గా నిల‌వ‌డం తెలిసిన విష‌య‌మే. (తమన్నా ఆహా)

Advertisement
 
Advertisement
Advertisement