బావా మరదళ్ల మధ్య ఇరుక్కుపోయారుగా!

Deepika Padukone Shares Adorable Pic With Ranveer Singh Anisha Padukone - Sakshi

‘చప్పాక్‌’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనే ప్రస్తుతం ఫ్యామిలీ టైమ్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. భర్త రణ్‌వీర్‌ సింగ్‌, చెల్లెలు అనీషా పదుకొనేతో కలిసి ఇంట్లో సందడి చేస్తున్నారు. వీరిద్దరితో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన దీపికా...‘ ఆత్మీయ ఆలింగనాలు.. మధ్యలో స్మాష్‌ అయిపోయా’ అంటూ క్యాప్షన్‌ జతచేశారు. ఇప్పటికే 17 లక్షలకు పైగా లైకులు సాధించిన ఈ ఫొటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. బావా మరదళ్ల మధ్య దీపికా ఇరుక్కుపోయారుగా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కాగా ‘రాజీ’ ఫేం మేఘనా గుల్జార్‌ దర్శకత్వంలో యాసిడ్‌ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా ‘చప్పాక్‌’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో లీడ్‌ రోల్‌ పోషించడంతో పాటుగా...తొలిసారిగా నిర్మాత అవతారమెత్తారు దీపికా. ఢిల్లీలో ప్రారంభమైన ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ మంగళవారం ముగిసింది. నెక్ట్స్‌ షెడ్యూల్‌ను టీమ్‌ ముంబైలో ప్లాన్‌ చేసినట్లు బాలీవుడ్‌ టాక్‌. ఇక సింబా, గల్లీ బాయ్‌ వంటి సూపర్‌ హిట్లతో ఫుల్‌ జోష్‌లో ఉన్న రణ్‌వీర్‌ ప్రస్తుతం టీమిండియా మాజీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌ పాత్రలో నటిస్తున్న 83 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top