పెద్ద మనసు చాటుకున్న నయనతార | Coronavirus: Nayanthara Donates RS 20 Lakhs To FEFSI | Sakshi
Sakshi News home page

సినీ కార్మికులకు నయనతార సాయం

Apr 4 2020 4:04 PM | Updated on Apr 4 2020 4:25 PM

Coronavirus: Nayanthara Donates RS 20 Lakhs To FEFSI - Sakshi

ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కరోనా మహమ్మారి సినీ పరిశ్రమను తీవ్రంగా కుదిపేసింది. లాక్‌డౌన్‌ వల్ల  సినిమా షూటింగ్‌లన్నీ నిలిచిపోవడంతో సినీ కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ త‌రుణంలో పేద సినీ కార్మికులను కాపాడ‌టానికి సినీ ప్ర‌ముఖులు ముందుకొస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోలు తమ వంతు సాయాన్ని అందించారు.
(చదవండి : కరోనాపై పోరుకు బాలయ్య విరాళం : చిరు ట్వీట్‌)

తాజాగా లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార కూడా సినీ కార్మికులను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. తన వంతు బాధ్యతగా ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌతిండియా(ఫెఫ్సీ)కి రూ.20 లక్షల విరాళం ప్రకటించారు. మరో తమిళ నటి ఐశ్వర్య రాజేష్‌ లక్ష రూపాయలను విరాళంగా అందించారు. టాలీవుడ్‌ హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి  కరోనా క్రైసిస్ ఛారిటీ‌ కి రూ. లక్షను విరాళంగా ప్రకటించారు. బాలీవుడ్ నుంచి కూడా పలువురు హీరోలు,హీరోయిన్లు ముందుకు వచ్చారు. కంగనా రనౌత్ పీఎం కేర్స్ నిధికి 25 లక్షలు ప్రకటించారు. దీపికా పదుకోనే కూడా తన వంతుగా సాయం చేస్తామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement