కరోనా క్రైసిస్‌: పోసాని గొప్ప మనుసు | CoronaCrisis: Posani Krishna Murali Provide Daily Needs To 50 Poor Families | Sakshi
Sakshi News home page

కరోనా క్రైసిస్‌: పోసాని గొప్ప మనుసు

Apr 7 2020 2:17 PM | Updated on Apr 7 2020 2:17 PM

CoronaCrisis: Posani Krishna Murali Provide Daily Needs To 50 Poor Families - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రముఖ రచయిత, దర్శకుడు, విలక్షణ నటుడు పోసాని కృష్ణమురళి మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తుండటంతో ప్రధాని నరేంద్ర మోదీ 21 రోజుల లాక్‌డౌన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదవాళ్లు, రోజువారి కార్మికులకు ఉపాధి లేకుండా పోయింది. రెక్కాడితే గాని డొక్కాడని ఆ పేద కుటుంబాలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఈ క్రమంలో వారిని అదుకోవడానికి టాలీవుడ్‌ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా నేను సైతం అంటూ పోసాని కృష్ణమురళి కూడా తన వంతు బాధ్యతగా సాయాన్ని ప్రకటించారు. లాక్‌డౌన్‌ కారణంగా పనులు లేకుండా పోయిన 50 పేద కుటుంబాలకు ఒక నెలకు సరిపడే విధంగా అన్ని వస్తువులను అందజేశారు. దీంతో ఆ 50 కుటుంబాల్లో చిరునవ్వును నింపారు. పోసాని చేసిన గొప్ప పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అంతేకాకుండా ఆయన బాటలో మరికొంత మంది నడిచి ప్రతీ ఒక్క పేదవాడి కడుపు నింపాలని పలువురు ఆకాంక్షించారు.       

Advertisement
 
Advertisement
Advertisement