గురుశిష్యులు కలిశారు | Chiranjeevi meets amitabh at sye raa movie setting | Sakshi
Sakshi News home page

గురుశిష్యులు కలిశారు

Mar 16 2019 12:25 AM | Updated on Mar 16 2019 12:25 AM

Chiranjeevi meets amitabh at sye raa movie setting - Sakshi

గురువు హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. శిష్యుడు ఆప్యాయంగా ఆహ్వానించారు. సీన్లు గురించి చర్చించుకున్నారు. ఇద్దరూ కెమెరా ముందుకి వచ్చారు. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘సైరా’. నరసింహారెడ్డి పాత్రను చిరంజీవి చేస్తుండగా ఆయన గురువు పాత్రను అమితాబ్‌ బచ్చన్‌ చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం గురుశిష్యులు, ఇతర ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాలు చిత్రీకరించారు.

కొంత విరామం తర్వాత అమితాబ్‌ మళ్లీ ఈ షూటింగ్‌లో పాల్గొనడానికి హైదరాబాద్‌ వచ్చారు. నాలుగు రోజులు చిత్రీకరణలో పాల్గొంటే అమితాబ్‌ పాత్ర మొత్తం పూర్తయిపోతుంది. కొణిదెల ప్రొడక్షన్స్‌ పతాకంపై రామ్‌చరణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్‌లో విడుదల కానుంది. 

Advertisement
 
Advertisement
Advertisement