కన్నడంలో ఆరంగేట్రానికి బ్రహ్మానందం రెడీ! | Brahmanandam ready for Kannada film debut with 'Ninnidale' | Sakshi
Sakshi News home page

కన్నడంలో ఆరంగేట్రానికి బ్రహ్మానందం రెడీ!

Dec 11 2013 12:48 PM | Updated on Sep 2 2017 1:29 AM

కన్నడంలో ఆరంగేట్రానికి బ్రహ్మానందం రెడీ!

కన్నడంలో ఆరంగేట్రానికి బ్రహ్మానందం రెడీ!

అఖిలాంధ్ర ప్రేక్షకులను దాదాపు 800కు పైగా సినిమాలతో కడుపుబ్బ నవ్వించిన హాస్యనటుడు బ్రహ్మానందం.. ఇక కన్నడిగులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.

వెండితెరపై అయినా, బుల్లి తెరపై అయినా సరే.. ఆ ముఖం కనపడితే చాలు, నవ్వు దానంతట అదే పుట్టుకొస్తుంది. 'నా పెర్ఫార్మెన్స్ నచ్చితే స్మాల్ బాస్ స్పేస్ పద్మశ్రీ అని టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ' అంటూ చేతులు కట్టుకుని పైకి చూస్తూ చెప్పి అఖిలాంధ్ర ప్రేక్షకులను దాదాపు 800కు పైగా సినిమాలతో కడుపుబ్బ నవ్వించిన హాస్యనటుడు బ్రహ్మానందం.. ఇక కన్నడిగులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.

'నిన్నిదలే' అనే కన్నడ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. శుక్రవారం నుంచి సినిమా షూటింగులో ఆయన పాల్గొంటారు. ఈ చిత్ర దర్శకుడు జయంత్ పరాన్జీ తనకు చాలా మంచి మిత్రుడని, ఆయన వచ్చి అడగడంతో, కథ నచ్చి వెంటనే అంగీకరించానని బ్రహ్మానందం తెలిపారు. కన్నడంలో ఇది తనకు తొలిచిత్రమే కావచ్చు గానీ, ఇతర సినిమాలకు ఎంత కష్టపడ్డానో దీనికీ అంతే కష్టపడతానని చెప్పారు. గతంలో తెలుగులు శంకర్ దాదా ఎంబీబీఎస్, టక్కరిదొంగ, ఈశ్వర్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన జయంత్ సి. పరాన్జీ ఈ కన్నడ చిత్రానికి దర్శకుడు. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ హీరో కాగా, ఎరికా ఫెర్నాండెజ్ హీరోయిన్. ఈ సంవత్సరం మొదట్లో బ్రహ్మానందం 'వెల్కమ్2' చిత్రంతో బాలీవుడ్లో ఆరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement