breaking news
Kannada debut
-
కాంతార ప్రీక్వెల్.. మరో స్టార్ నటుడు అరంగేట్రం!
కాంతార మూవీతో పాన్ ఇండియావ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు రిషబ్ శెట్టి. ఈ సినిమాకు ముందు పెద్దగా పరిచయం లేని ఆయన.. ఈ ఒక్క మూవీతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రీక్వెల్‌గా కాంతార చాప్టర్-1 సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరిదశకు చేరుకుంది.తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో ఆసక్తికర పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య నటిస్తున్నట్లు మేకర్స్ రివీల్ చేశారు. తాజాగా ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ మూవీలో కులశేఖర పాత్రలో మెప్పించనున్నారు. దాదాపు ఏడు భాషల్లో గుల్షన్ దేవయ్య పోస్టర్ రిలీజ్ చేశారు. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ద్వారా గుల్షన్ దేవయ్య శాండల్‌వుడ్ అరంగేట్రం చేయనున్నారు.ఈ చిత్రంలో మరో నటి రుక్మిణి వసంత్ కనకవతి పాత్రలో కనిపించనుంది. ఇటీవలే ఆమె రోల్ రివీల్ చేస్తూ పోస్టర్‌ను విడుదల చేశారు. హోంబాలే ఫిల్మ్స్ బ్యానర్లో విజయ్ కిరగందూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రం అక్టోబర్ 2న కన్నడ, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. View this post on Instagram A post shared by Hombale Films (@hombalefilms) -
కన్నడంలో ఆరంగేట్రానికి బ్రహ్మానందం రెడీ!
వెండితెరపై అయినా, బుల్లి తెరపై అయినా సరే.. ఆ ముఖం కనపడితే చాలు, నవ్వు దానంతట అదే పుట్టుకొస్తుంది. 'నా పెర్ఫార్మెన్స్ నచ్చితే స్మాల్ బాస్ స్పేస్ పద్మశ్రీ అని టైప్ చేసి ఎస్ఎంఎస్ పంపండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ' అంటూ చేతులు కట్టుకుని పైకి చూస్తూ చెప్పి అఖిలాంధ్ర ప్రేక్షకులను దాదాపు 800కు పైగా సినిమాలతో కడుపుబ్బ నవ్వించిన హాస్యనటుడు బ్రహ్మానందం.. ఇక కన్నడిగులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. 'నిన్నిదలే' అనే కన్నడ చిత్రంలో ఆయన నటిస్తున్నారు. శుక్రవారం నుంచి సినిమా షూటింగులో ఆయన పాల్గొంటారు. ఈ చిత్ర దర్శకుడు జయంత్ పరాన్జీ తనకు చాలా మంచి మిత్రుడని, ఆయన వచ్చి అడగడంతో, కథ నచ్చి వెంటనే అంగీకరించానని బ్రహ్మానందం తెలిపారు. కన్నడంలో ఇది తనకు తొలిచిత్రమే కావచ్చు గానీ, ఇతర సినిమాలకు ఎంత కష్టపడ్డానో దీనికీ అంతే కష్టపడతానని చెప్పారు. గతంలో తెలుగులు శంకర్ దాదా ఎంబీబీఎస్, టక్కరిదొంగ, ఈశ్వర్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన జయంత్ సి. పరాన్జీ ఈ కన్నడ చిత్రానికి దర్శకుడు. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ హీరో కాగా, ఎరికా ఫెర్నాండెజ్ హీరోయిన్. ఈ సంవత్సరం మొదట్లో బ్రహ్మానందం 'వెల్కమ్2' చిత్రంతో బాలీవుడ్లో ఆరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.