పాటల రచయిత అన్వర్‌ ఇక లేరు

Bollywood Lyricist Anwar Sagar Breathed His Last in A Hospital In Mumbai - Sakshi

సాక్షి, ముంబై : బాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ పాటల రచయిత అన్వర్‌ సాగర్‌(70) మరణించారు. స్థానిక కోకిలాబెన్‌ ధీరుభాయ్‌ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు, వైద్యులు తెలిపారు. అయితే ఆయన మరణానికి గల కారణాలను వెల్లడించలేదు. ఆయన మరణం పట్ల బాలీవుడ్‌ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.  పలువురు సినీ ప్రముఖులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ వారి కుటుంబానికి తమ సంతాపాన్ని సోషల్‌ మీడియా వేదికగా తెలియజేస్తున్నారు. (సోదరి కోసం విమానం.. ఖండించిన అక్షయ్‌)

ఇలాంటి విషాద సమయంలో అన్వర్ కుటుంబానికి మనోధైర్యాన్ని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం అని ఇండియన్ పెర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ లిమిటెడ్ ట్విటర్‌ వేదికగా సంతాపం తెలిపింది. 1980 -90 లలో అన్వర్‌ సాగర్‌ పాటలు మార్మోగాయి. అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించిన ఖిలాడీ చిత్రంలో ఆయన రాసిన రొమాంటిక్‌ ట్రాక్‌ సాంగ్‌ ‘వాదా రహా సనమ్‌’ సంగీత ప్రియులను ఎంతగానో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. జాకీ ష్రాఫ్‌, అజయ్‌ దేవ్‌గణ్‌ వంటి స్టార్‌ హీరోల చిత్రాలకు సాహిత్యం అందించిన అన్వర్‌ సాగర్‌ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. (దూ..రం.. అ..యి..తే.. నష్టమే!)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top