చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది: అక్షయ్‌

Akshay Kumar Tweeted On Fake news About Booking a Flight For Sister - Sakshi

ముంబై : తన సోదరి కోసం ప్రత్యేక విమానం బుక్‌ చేసినట్లు వస్తున్న వార్తలపై బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ స్పందించారు. తను ఎవరి కోసం విమానం బుక్‌ చేయలేదని స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ నుంచి తన సోదరి ఎలాంటి ప్రయాణాలు చేయలేదని క్లారిటీ ఇచ్చారు. కాగా అక్షయ్‌ కుమార్‌.. తన సోదరి ఆల్కా భాటియాతోపాటు ఇద్దరు పిల్లలను ఢిల్లీకి పంపించేందుకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసినట్లు ఆదివారం పుకార్లు వినిపించాయి. వీటిని ఖండించిన అక్షయ్‌ ఈ వార్తలు అవాస్తవమన్నారు. అంతేగాక ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచురించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆగ్రహం వ్యక్తం చేశారు. (‘నా భర్తతో కలిసి ఉండలేను.. సాయం చేయండి’)

‘నా సోదరి, ఆమె ఇద్దరి పిల్లల కోసం ప్రత్యేక విమానం బుక్‌ చేశానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి నా సోదరి ఎక్కడికి ప్రయాణించలేదు. అలాగే తనకు కేవలం ఒకరే సంతానం. ఇలాంటి అవాస్తవాలను ప్రచురిస్తే చట్టరీత్యా చర్యలు తోసుకోవాల్సి వస్తుంది’. అని ట్వీటర్‌లో పేర్కొన్నారు. కాగా అక్షయ్‌ ట్వీట్‌తో సదరు వెబ్‌సైట్‌ ఆ న్యూస్‌ను తొలగించింది. (షూటింగ్‌లో పాల్గొన్న అక్ష‌య్ కుమార్)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top