
బాలీవుడ్‌లో యాంకర్‌గా, కమెడియన్‌గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది భారతీ సింగ్. అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో అందరి ముఖాల్లో నవ్వులు తెప్పించే భారతి సెలబ్రిటీ స్టేటస్ అందుకోవడానికి ఎంతో కష్టపడ్డారట. ఒక టీవీ షోలో పాల్గొన్న భారతి.. బాల్యంలో తాను ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చారు. ‘ఆడపిల్లనని తెలియగానే గర్భంలో ఉన్నపుడే మా అమ్మ అబార్షన్ చేయించుకోవాలనుకున్నారు. అప్పుడు మా కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల ఆ నిర్ణయం తీసుకుంది. కానీ ఎందుకనో ఆ ఆలోచనను అమలు చేయలేకపోయిందంటూ’ భావోద్వేగానికి లోనయ్యారు. అమ్మంటే తనకెంతో ఇష్టమని, తన ప్రతీ విజయం వెనుక ఆమె ఉందని, తనను అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి ఆమేనని భారతీ సింగ్ చెప్పుకొచ్చారు.