ప్రతీ జన్మలో నువ్వే భర్తగా రావాలి.. | Bharti Singh Adorable Wishes For Hubby On Marriage Anniversary | Sakshi
Sakshi News home page

రెండేళ్లుగా ఇలాగే ఉంది.. అయినా..

Dec 3 2019 6:53 PM | Updated on Dec 3 2019 9:03 PM

Bharti Singh Adorable Wishes For Hubby On Marriage Anniversary - Sakshi

‘రెండేళ్లుగా ఇలాగే ఉంది. అయినా నాకు నచ్చుతుంది’

‘నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నా. నువ్వులేని జీవితాన్ని అస్సలు ఊహించలేను కూడా. నా ప్రతీ ఆలోచనలో.. ప్రతీ క్షణంలో నువ్వే. నాకంటే నువ్వే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావని తెలుసు. చిన్న పిల్లలా నన్ను గారాబం చేస్తావు. నా ప్రతీ కోరికను నెరవేరుస్తావు. నేను మొండిగా ప్రవర్తించినపుడు నచ్చజెప్పుతావు. కేవలం ఏడు జన్మలకే కాదు... ప్రతీ జన్మలోనూ నువ్వే నా భర్తగా రావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా’ అంటూ బాలీవుడ్‌ కామెడీ క్వీన్‌ భారతీ సింగ్‌ తన భర్త హర్ష్‌ లింబాచియాపై ఉన్న ప్రేమచాటుకున్నారు. తమ రెండో వివాహ వార్షికోత్సవం సందర్భంగా మెహందీ, సంగీత్, పెళ్లినాటి వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాలో షేర్‌ చేశారు. తనపై ఎంతగానో ప్రేమ కురిపిస్తున్నందుకు భర్తకు ధన్యవాదాలు తెలిపారు. తన భర్తే తన సోల్‌మేట్‌, బెస్ట్‌ ఫ్రెండ్‌ అని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో బీ- టౌన్‌ సెలబ్రిటీలు సహా అభిమానుల నుంచి భారతీ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక హర్ష్‌ కూడా ఓ ఫన్నీ ఫొటోను షేర్‌ చేసి.. ‘రెండేళ్లుగా ఇలాగే ఉంది. అయినా నాకు నచ్చుతుంది’అంటూ క్యాప్షన్‌ జతచేశాడు. కాగా హిందీ టెలివిజన్‌ చరిత్రలో భారతీ సింగ్‌ తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం తెలిసిందే. టాప్‌ కమెడియన్‌గా, యాంకర్‌గా పేరు తెచ్చుకున్న భారతీ.. 2017 డిసెంబరు 3న అత్యంత సన్నిహితుల సమక్షంలో తన చిరకాల స్నేహితుడు హర్ష్‌ లంబాచియాను పెళ్లాడారు. ప్రతీ కార్యక్రమంలో తన భర్తతో కలిసి సందడి చేసే భారతీ.. వీలు చిక్కినప్పుడల్లా తమ బంధం గురించి సెటైర్లు వేస్తూనే భర్త పట్ల ఉన్న ప్రేమను చాటుకుంటారు. ప్రస్తుతం ఈ జంట ఓ ప్రముఖ చానెల్‌లో ప్రసారమవుతున్న రియాలిటీ షోలో పాల్గొంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement