ధృవ కష్టం తెలుస్తోంది | aswamedham movie trailer and poster launch | Sakshi
Sakshi News home page

ధృవ కష్టం తెలుస్తోంది

Jul 20 2019 12:43 AM | Updated on Jul 20 2019 12:43 AM

aswamedham movie trailer and poster launch - Sakshi

ప్రియదర్శి, ధృవ కరుణాకర్, నితిన్, శివంగి

ధృవ కరుణాకర్‌ హీరోగా నటించిన చిత్రం ‘అశ్వమేథం’. నితిన్‌ దర్శకత్వంలో ప్రియా నాయర్, వందనా యాదవ్, ఐశ్వర్యా యాదవ్, శుభ మల్హోత్రా, రూపేష్‌లు నిర్మించారు. ఈ చిత్రం ట్రైలర్, పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ వేడుకలో పి. కిరణ్, తమ్మారెడ్డి భరద్వాజలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. భరద్వాజ మాట్లాడుతూ– ‘‘సంజయ్‌ వల్లనే ఈ కార్యక్రమానికి వచ్చాను. నన్ను నిర్మాణం వైపు నడిపించిన వ్యక్తి కూడా తనే. ఈ చిత్రం ట్రైలర్‌ బాగుంది. ధృవ చాలా కష్టపడ్డట్లు తెలుస్తోంది’’ అన్నారు.

‘‘ఈ సినిమా కోసం హాంకాంగ్‌లో మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకున్నాను. డూప్‌ లేకుండా నటించాను. నన్ను నమ్మి నా కోసం కోట్లు ఖర్చుపెట్టిన నిర్మాతలకు ధన్యవాదాలు. నేను, దర్శకుడు నితిన్‌ టాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాం’’ అన్నారు «ధృవ. ‘‘స్టోరీ, స్క్రీన్‌ప్లే, యాక్షన్‌ సీన్స్‌ హైలైట్‌గా ఉంటాయి. ఆగస్టులో విడుదల ప్లాన్‌ చేశాం’’ అన్నారు నితిన్‌. ‘‘ధృవ చేసిన సాహసాలకు షాకయ్యా. అనుకున్న డేట్‌ కంటే ముందుగానే సినిమాను పూర్తి చేసే నితిన్‌ లాంటి దర్శకుడు ఇండస్ట్రీకి అవసరం. ఈ చిత్రంలో నేను చేసిన మాంత్రికుడి పాత్ర ప్రేక్షకులకు నచ్చుతుందని అనుకుంటున్నాను’’ అన్నారు సుమన్‌.

Advertisement
 
Advertisement
Advertisement