ఏప్రిల్‌ 2న ‘నిశ్శబ్దం’ | Anushka Shetty Nishabdam Movie Will Release On 2nd APril | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌లో ’నిశ్శబ్దం’గా అనుష్క

Feb 8 2020 3:59 PM | Updated on Feb 8 2020 4:06 PM

Anushka Shetty Nishabdam Movie Will Release On 2nd APril - Sakshi

అనుష్క నటించిన తాజా చిత్రం నిశ్శబ్దం విడుదలకు డేట్‌ ఫిక్స్‌ అయింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. గత ఏడాదే విడుదల కావాల్సిన ఈ సినిమా సాంకేతిక కారణాలతో వాయిదా పడిన విషయం తెలిసిందే. అనుష్క, మాధవన్, అంజలి, షాలినీ పాండే, సుబ్బరాజు, మైఖేల్‌ మ్యాడిసన్‌ ముఖ్య పాత్రల్లో నటించిన ‘నిశ్శబ్దం’చిత్రానికి హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించారు.

తెలుగులో ‘నిశ్శబ్దం’, మిగతా భాషల్లో ‘సైలెన్స్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా కథ అమెరికాలోని సియోటల్ బ్యాక్ డ్రాప్‌లో సాగుతుంది. ఇక ఇందులో అనుష్క మూగ చిత్రకారిణి సాక్షి పాత్రలో నటిస్తున్నారు.  ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్‌ నిర్మించారు. ఏప్రిల్‌ రెండో తేదీని సినిమా విడుదల చేయనున్నట్లు కోన వెంకట్‌ ట్వీట్‌ చేశారు. భాగమతి చిత్రం తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా కావడంతో ‘నిశ్శబ్ధం’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement