అన‌సూయ ‘క‌థ‌నం’ టాకీ పూర్తి | Anasuya Kathanam Takie Part Completed | Sakshi
Sakshi News home page

Jan 30 2019 5:28 PM | Updated on Jan 30 2019 5:28 PM

Anasuya Kathanam Takie Part Completed - Sakshi

ది మంత్ర ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, ది గాయ‌త్రి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం క‌థ‌నం. బి.న‌రేంద్రరెడ్డి, శ‌ర్మచుక్కా ఈ చిత్రానికి నిర్మాత‌లు. రాజేష్‌ నాదెండ్ల ద‌ర్శక‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అన‌సూయ భ‌ర‌ద్వాజ్ మెయిన్ లీడ్ గా న‌టిస్తున్నారు. ఈ చిత్రం రెండు సాంగ్స్ మిన‌హా టాకీ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుని స‌మ్మర్‌లో విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. 

ఈ సంద‌ర్భంగా అన‌సూయ మాట్లాడుతూ... క‌థ‌నం సినిమా పేరు. క‌థ‌నం అంటే క‌థ‌ని న‌డిపే విధానం మా ఫ‌స్ట్ లుక్ విడుద‌లైన త‌ర్వాత చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. నేను క్షణంలో క‌నిపించిన పాత్రలో ఉన్నట్లు ఉంద‌ని అంద‌రూ అనుకుంటున్నారు. కాని కాదు నాది ఈ చిత్రంలో ఏడీ క్యారెక్టర్ ఒక అసోసియేట్ డైరెక్టర్  పాత్ర‌. నాకు సహకరించిన మా యూనిట్ అంద‌రికీ కృత‌జ్ఞత‌లు అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement