ఓ ఆత్మ స్వరం! | Anandini Movie Audio released by Telangana Speaker | Sakshi
Sakshi News home page

ఓ ఆత్మ స్వరం!

Nov 30 2014 11:03 PM | Updated on Sep 2 2017 5:24 PM

ఓ ఆత్మ స్వరం!

ఓ ఆత్మ స్వరం!

అర్చన టైటిల్ రోల్‌లో తన్నీరు రాంబాబు నిర్మించిన చిత్రం ‘ఆనందిని’. నిర్ణయ్ పల్లాటి దర్శకత్వం

 అర్చన టైటిల్ రోల్‌లో తన్నీరు రాంబాబు నిర్మించిన చిత్రం ‘ఆనందిని’. నిర్ణయ్ పల్లాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ‘ది వాయిస్ ఆఫ్ సోల్’ అనేది ఉపశీర్షిక. శశికుమార్ రాజేంద్రన్, లిజా జంటగా నటించిన ఈ చిత్రానికి బండి సత్యం పాటలు స్వరపరిచారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ఆడియో వేడుకలో తెలంగాణ తొలి శాసన సభ స్పీకర్ మధుసూదనాచారి సీడీని ఆవిష్కరించారు.
 
 ఈ చిత్రం పాటలు చాలా బాగున్నాయనీ, బండి సత్యం తమ ఊరివాడేనని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ చిత్రం అవుట్‌పుట్ బాగా వచ్చిందని దర్శకుడు చెప్పారు. అర్చన మాట్లాడుతూ - ‘‘చాలా ఇష్టపడి చేసిన చిత్రమిది. నటిస్తున్నప్పుడే కాదు.. డబ్బింగ్ చెబుతున్నప్పుడు కూడా థ్రిల్ అయ్యాను’’ అన్నారు. ఈ చిత్రం కోసం ప్రస్తుతం సమాజంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాల నేపథ్యంలో రాసిన పాట, తన కెరీర్‌లో చెప్పుకోదగ్గ విధంగా ఉంటుందన చంద్రబోస్ పేర్కొన్నారు. ఇందులో మంచి పాత్రలు చేశామని శశికుమార్, లిజా తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement