Anandini
-
తొలిప్రేమలో...
తెలుగు ప్రేక్షకులకు ‘తొలిప్రేమ’ అంటే పవన్‌కల్యాణ్ చిత్రం గుర్తొస్తుంది. ఇప్పుడు ‘తొలిప్రేమలో’ అంటూ మరో చిత్రం వస్తోంది. ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘కయల్’. చంద్రన్, ఆనందిని జంటగా నటించిన ఈ చిత్రాన్ని యాదాద్రి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ‘తొలిప్రేమలో’ పేరుతో తెలుగులోకి అనువదించారు. తమటం శ్రీనివాసగౌడ్, జయారపు రామకృష్ణ, గౌలిఖార్ శ్రీనివాస్ నిర్మాతలు. డి.ఇమాన్ స్వరపరిచిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథి దర్శకుడు ఎన్.శంకర్ మాట్లాడుతూ - ‘‘ప్రేమకథలో ఉండాల్సిన అన్ని భావోద్వేగాలు ఈ చిత్రంలో ఉన్నాయి. తమిళంలో ప్రభు సాల్మన్ తనకంటూ ఓ మార్క్ సృష్టించుకున్నాడు. సినిమాలో మంచి కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని పలు చిత్రాలు నిరూపించాయి. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. -
ఓ ఆత్మ స్వరం!
అర్చన టైటిల్ రోల్లో తన్నీరు రాంబాబు నిర్మించిన చిత్రం ‘ఆనందిని’. నిర్ణయ్ పల్లాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ‘ది వాయిస్ ఆఫ్ సోల్’ అనేది ఉపశీర్షిక. శశికుమార్ రాజేంద్రన్, లిజా జంటగా నటించిన ఈ చిత్రానికి బండి సత్యం పాటలు స్వరపరిచారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ఆడియో వేడుకలో తెలంగాణ తొలి శాసన సభ స్పీకర్ మధుసూదనాచారి సీడీని ఆవిష్కరించారు. ఈ చిత్రం పాటలు చాలా బాగున్నాయనీ, బండి సత్యం తమ ఊరివాడేనని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ చిత్రం అవుట్‌పుట్ బాగా వచ్చిందని దర్శకుడు చెప్పారు. అర్చన మాట్లాడుతూ - ‘‘చాలా ఇష్టపడి చేసిన చిత్రమిది. నటిస్తున్నప్పుడే కాదు.. డబ్బింగ్ చెబుతున్నప్పుడు కూడా థ్రిల్ అయ్యాను’’ అన్నారు. ఈ చిత్రం కోసం ప్రస్తుతం సమాజంలో మహిళలపై జరుగుతున్న అకృత్యాల నేపథ్యంలో రాసిన పాట, తన కెరీర్లో చెప్పుకోదగ్గ విధంగా ఉంటుందన చంద్రబోస్ పేర్కొన్నారు. ఇందులో మంచి పాత్రలు చేశామని శశికుమార్, లిజా తెలిపారు.