తొలిప్రేమలో... | Tolipremalo movie in Anandini | Sakshi
Sakshi News home page

తొలిప్రేమలో...

Jul 15 2016 11:39 PM | Updated on Sep 4 2017 4:56 AM

తొలిప్రేమలో...

తొలిప్రేమలో...

తెలుగు ప్రేక్షకులకు ‘తొలిప్రేమ’ అంటే పవన్‌కల్యాణ్ చిత్రం గుర్తొస్తుంది. ఇప్పుడు ‘తొలిప్రేమలో’ అంటూ మరో చిత్రం వస్తోంది.

తెలుగు ప్రేక్షకులకు ‘తొలిప్రేమ’ అంటే పవన్‌కల్యాణ్ చిత్రం గుర్తొస్తుంది. ఇప్పుడు ‘తొలిప్రేమలో’ అంటూ మరో చిత్రం వస్తోంది. ప్రభు సాల్మన్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం ‘కయల్’. చంద్రన్, ఆనందిని జంటగా నటించిన ఈ చిత్రాన్ని యాదాద్రి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ‘తొలిప్రేమలో’ పేరుతో తెలుగులోకి అనువదించారు. తమటం శ్రీనివాసగౌడ్, జయారపు రామకృష్ణ, గౌలిఖార్ శ్రీనివాస్ నిర్మాతలు. డి.ఇమాన్ స్వరపరిచిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. ముఖ్య అతిథి దర్శకుడు ఎన్.శంకర్ మాట్లాడుతూ - ‘‘ప్రేమకథలో ఉండాల్సిన అన్ని భావోద్వేగాలు ఈ చిత్రంలో ఉన్నాయి.

తమిళంలో ప్రభు సాల్మన్ తనకంటూ ఓ మార్క్ సృష్టించుకున్నాడు. సినిమాలో మంచి కంటెంట్ ఉంటే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని పలు చిత్రాలు నిరూపించాయి. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు.

Advertisement

పోల్

Advertisement