టీజర్‌తో షాక్‌ ఇచ్చిన అమలా పాల్‌ | Amala Paul Shocking Look in Aame Teaser | Sakshi
Sakshi News home page

టీజర్‌తో షాక్‌ ఇచ్చిన అమలా పాల్‌

Jun 19 2019 11:09 AM | Updated on Jun 19 2019 11:18 AM

Amala Paul Shocking Look in Aame Teaser - Sakshi

సౌత్ హీరోలు మాత్రమే కాదు హీరోయిన్లు కూడా సంచలనాలు సృష్టిస్తున్నారు. పాత్ర డిమాండ్‌ చేస్తే ఎలా అయినా నటించేందుకు రెడీ అంటున్నారు. తాజాగా సౌత్‌ హీరోయిన్ అమలా పాల్‌ తన తాజా చిత్రం ఆడై కోసం నగ్నంగా నటించి అందరికీ షాక్‌ ఇచ్చారు. ఫస్ట్ లుక్‌ పోస్టర్‌తోనే ఆకట్టుకున్న చిత్రయూనిట్ టీజర్‌ తో అంచనాలను మరింతగా పెంచేశారు.

తెలుగులో ఆమె అనే పేరుతో రిలీజ్ అయిన ఈ టీజర్‌కు సూపర్బ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఓ తల్లి తన కూతురు తప్పి పోయినట్టుగా పోలీస్‌ స్టేషన్లో  కంప్లయింట్‌ ఇవ్వటం తరువాత పోలీసులకు అమలా పాల్‌ దారుణమైన పరిస్థితుల్లో కనిపించటం లాంటి సన్నివేశాలతో టీజర్‌ను కట్ చేశారు. గతంలో సౌత్‌ లో ఏ హీరోయిన్‌ చేయని సాహసం చేసిన అమలాపాల్‌ను సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు.

వీ స్టూడియోస్‌ బ్యానర్‌పై రత్నకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ టీజర్‌ను బాలీవుడ్ దర్శకుడు కరణ్‌ జోహార్‌ విడుదల చేయగా తెలుగు టీజర్‌ను రామ్‌ గోపాల్‌ వర్మ రిలీజ్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement