ఆ సినిమా పక్కన పెట్టిన బన్నీ! | Allu Arjun Postpone Venu Sreeram's Icon | Sakshi
Sakshi News home page

ఆ సినిమా పక్కన పెట్టిన బన్నీ!

Sep 15 2019 10:33 AM | Updated on Sep 15 2019 12:57 PM

Allu Arjun Postpone Venu Sreeram's Icon - Sakshi

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా తరువాత లాంగ్‌ గ్యాప్‌ తీసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌ ఇప్పుడు వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో అల వైకుంఠపురములో సినిమాలో నటిస్తున్న బన్నీ, మరో రెండు సినిమాలను లైన్‌లో పెట్టాడు.

త్రివిక్రమ్‌ సినిమా తరువాత వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో ఐకాన్ సినిమా చేయనున్నట్టుగా గతంలోనే ప్రకటించాడు బన్నీ. తాజా సమాచారం ప్రకారం ఐకాన్‌ను పక్కన పెట్టి సుకుమార్ సినిమాను లైన్‌లోకి తీసుకువచ్చినట్టుగా ప్రచారం జరుగుతోంది. సుకుమార్‌తో ఉన్న స్నేహం కారణంగా బన్నీ ఈ నిర్ణయం తీసుకున్నాడట. ముందుగా సుకుమార్ సినిమాను పూర్తి చేసి, తరువాత ఐకాన్‌ను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు.

తన హోమ్‌ బ్యానర్‌ గీతా ఆర్ట్స్‌తో కలిసి హారికా హాసిని క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తున్న అల వైకుంఠపురములో సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. యంగ్ హీరో సుశాంత్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నవదీప్‌ విలన్‌గా నటిస్తున్నాడన్న ప్రచారం జరుగుతోంది. సీనియర్‌ టబు, మలయాళ నటుడు జయరామ్‌, మురళీ శర్మలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement