అహం బ్రహ్మస్మి | Aham Brahmasmi Poster Launch | Sakshi
Sakshi News home page

అహం బ్రహ్మస్మి

Feb 14 2020 12:48 AM | Updated on Feb 14 2020 12:48 AM

Aham Brahmasmi Poster Launch - Sakshi

మంచు మనోజ్‌

దాదాపు మూడేళ్లు వెండితెరకు దూరంగా ఉన్న మంచు మనోజ్‌ తన తర్వాతి చిత్రానికి సంబంధించిన వివరాలను గురువారం వెల్లడించారు. మనోజ్‌ తాజా చిత్రానికి ‘అహం బ్రహ్మస్మి’ అనే టైటిల్‌ ఖరారైంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా టైటిల్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. శ్రీకాంత్‌ ఎన్‌. రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ప్రారంభోత్సవం మార్చి 6న జరుగుతుంది. ఎంఎం ఆర్ట్స్‌ బ్యానర్‌పై విద్యా నిర్వాణ, మంచు ఆనంద్‌ సమర్పణలో మంచు మనోజ్, నిర్మలాదేవి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘నా తొలి చిత్రం ‘దొంగ దొంగది’ సమయంలో ఎలాంటి ఉద్వేగానికి లోనయ్యానో ఇప్పుడూ అదే భావోద్వేగంతో ఉన్నా’’ అని పేర్కొన్నారు మనోజ్‌.

Advertisement
 
Advertisement
Advertisement