సెన్సార్ బోర్డు సభ్యురాలిగా సినీనటి జీవిత | actress jeevitha appointed censor board member | Sakshi
Sakshi News home page

సెన్సార్ బోర్డు సభ్యురాలిగా సినీనటి జీవిత

Jan 19 2015 7:31 PM | Updated on Apr 3 2019 9:17 PM

సెన్సార్ బోర్డు సభ్యురాలిగా సినీనటి జీవిత - Sakshi

సెన్సార్ బోర్డు సభ్యురాలిగా సినీనటి జీవిత

ప్రముఖ నిర్మాత పహ్లాజ్ నిహలాని సెన్సార్ బోర్డు చైర్ పర్సన్ గా నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం సోమవారం ఈమేరకు నిర్ణయం తీసుకుంది.

న్యూఢిల్లీ: ప్రముఖ నిర్మాత పహ్లాజ్ నిహలాని సెన్సార్ బోర్డు చైర్ పర్సన్ గా నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం సోమవారం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. మరో 9 మంది సభ్యులను కూడా కేంద్ర ప్రభుత్వం నియమించింది. సభ్యులుగా నియమితులైనవారిలో సినీ నటి జీవితకూడా ఉన్నారు. ఎస్. శేఖర్, అశోక్ పండిత్, సయ్యద్ బరీ, మిహిర్ భూటా, చంద్ర ద్వివేది, వాణి త్రిపాఠి, రమేష్ పతంగె, జార్జ్ బేకర్ మిగతా సభ్యులు. 

'ద మెసెంజర్ ఆఫ్ గాడ్'  సినిమాకు అప్పిలేట్ ట్రిబ్యునల్‌ అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ బోర్డు చీఫ్ లీలా శాంసన్, 9 మంది సభ్యులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పహ్లాజ్ నిహలాని ప్రముఖ దర్శకుడు గోవింద్ నిహలాని సోదరుడు. బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హాకు ఆయన బావమరిది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement