సెన్సార్ బోర్డు సభ్యురాలిగా సినీనటి జీవిత
న్యూఢిల్లీ: ప్రముఖ నిర్మాత పహ్లాజ్ నిహలాని సెన్సార్ బోర్డు చైర్ పర్సన్ గా నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం సోమవారం ఈమేరకు నిర్ణయం తీసుకుంది. మరో 9 మంది సభ్యులను కూడా కేంద్ర ప్రభుత్వం నియమించింది. సభ్యులుగా నియమితులైనవారిలో సినీ నటి జీవితకూడా ఉన్నారు. ఎస్. శేఖర్, అశోక్ పండిత్, సయ్యద్ బరీ, మిహిర్ భూటా, చంద్ర ద్వివేది, వాణి త్రిపాఠి, రమేష్ పతంగె, జార్జ్ బేకర్ మిగతా సభ్యులు.
'ద మెసెంజర్ ఆఫ్ గాడ్' సినిమాకు అప్పిలేట్ ట్రిబ్యునల్ అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ బోర్డు చీఫ్ లీలా శాంసన్, 9 మంది సభ్యులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. పహ్లాజ్ నిహలాని ప్రముఖ దర్శకుడు గోవింద్ నిహలాని సోదరుడు. బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హాకు ఆయన బావమరిది.