అసలు సంగతి ఏంటి? | Aadi sai kumar jodi movie trailer launch | Sakshi
Sakshi News home page

అసలు సంగతి ఏంటి?

Aug 31 2019 12:03 AM | Updated on Aug 31 2019 12:03 AM

Aadi sai kumar jodi movie trailer launch - Sakshi

శ్రద్ధా శ్రీనాథ్, ఆది

‘అస్సలు ఈ టైమ్‌లో ఇంత హైట్‌లో కూర్చుని బీరు కొడుతున్నానంటే అసలు మ్యాటర్‌ ఏమై ఉంటుంది’ అంటూ ఆది సాయికుమార్‌ డైలాగ్‌తో విడుదలైన ‘జోడి’ ట్రైలర్‌ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. ఆది సాయికుమార్, శ్రద్ధా శ్రీనాథ్‌ జంటగా విశ్వనాథ్‌ అరిగెల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జోడి’. శ్రీనివాస్‌ గుర్రం సమర్పణలో భావన క్రియేషన్స్‌ పతాకంపై శాంతయ్య, పద్మజ, సాయి వెంకటేష్‌ గుర్రం నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 6న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ని విడుదల చేశారు. ‘‘అవుట్‌ అండ్‌ అవుట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది.

ప్రేమ, భావోద్వేగాలు ఆకట్టుకుంటాయి. ఆది, శ్రద్ధల మధ్య అందమైన ప్రేమకథతో పాటు వీకే నరేష్‌ పాత్ర చాలా ఆసక్తిగా ఉంటుంది. ఆది, శ్రద్ధ లుక్స్‌కి ప్రత్యేక ప్రశంసలు దక్కుతున్నాయి. అవుట్‌ డోర్‌ ప్రమోషన్స్‌లో కూడా చురుగ్గా ఉన్న మా చిత్రానికి ప్రీ రిలీజ్‌ బజ్‌ కూడా చాలా బాగా వచ్చింది. అన్ని వర్గాల ప్రేక్షలకు ఆకట్టుకునే అంశాలతో వస్తోన్న మా సినిమా సక్సెస్‌ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. గొల్లపూడి మారుతీరావు, సత్య, ‘వెన్నెల’ కిశోర్, సిజ్జు, స్వప్నిక, సితార, మాధవి, వర్షిణి సౌందరరాజన్, ప్రదీప్‌ ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: ‘నీవే’ ఫణికళ్యాణ్, కెమెరా: ఎస్‌.వి. విశ్వేశ్వర్‌.

Advertisement
 
Advertisement
Advertisement