‘ఉగ్ర’ ముఠాలను అణచాల్సిందే | We have to kill the terrorism | Sakshi
Sakshi News home page

‘ఉగ్ర’ ముఠాలను అణచాల్సిందే

Apr 16 2016 2:10 AM | Updated on Mar 23 2019 8:41 PM

ప్రపంచానికి పెను సవాలుగా మారిన ఉగ్రవాద సంస్థలన్నింటిపైనా చర్యలు తీసుకోవాల్సిందేనని పాకిస్తాన్‌కు అమెరికా స్పష్టం చేసింది.

వాషింగ్టన్: ప్రపంచానికి పెను సవాలుగా మారిన ఉగ్రవాద సంస్థలన్నింటిపైనా చర్యలు తీసుకోవాల్సిందేనని పాకిస్తాన్‌కు అమెరికా స్పష్టం చేసింది. హక్కానీ నెట్‌వర్క్ సహా ఎవరినీ వదిలిపెట్టకూడదంది. పాక్ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐతో హక్కానీకి ఉన్నసంబంధాలను అమెరికాకు చెందిన కేబుల్ ఒకటి బయటపెట్టడంతో అమెరికా ప్రతినిధి కిర్బీ ఈమేరకు స్పష్టం చేశారు.

2009లో అఫ్గానిస్తాన్‌లోని సీఐఏ క్యాంప్‌పై ఆత్మాహుతి దాడికిగాను హక్కానీకి ఐఎస్‌ఐ 2 లక్షల డాలర్లు ఇచ్చినట్టు ఈ కేబుల్స్ చెబుతున్నాయి.  కాగా, ద్వెపాక్షిక చర్చల పునరుద్ధరణకు భారత్ ముందుకు రావడం లేదని, ఇది ఇరు దేశాల మధ్య సంబంధాలపై ప్రభావం చూపుతుందని ఐరాసలోని పాక్  రాయబారి లోధీ చెప్పారు. మోదీ ప్రభుత్వం వచ్చాక ఆరంభంలో ఆశావహ వాతావరణం కనిపించినా, ఆమోదయోగ్యం కాని షరతులతో చర్చలు నిలిపేసిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement