కూతురి ముందు త‌ల్లి ఓడిపోవాల్సిందే | Watch Video Of Mom Wants To Meditate But Her Little Girl Make Disturbance | Sakshi
Sakshi News home page

కూతురి ముందు త‌ల్లి ఓడిపోవాల్సిందే

Jul 7 2020 5:17 PM | Updated on Jul 7 2020 5:40 PM

Watch Video Of Mom Wants To Meditate But Her Little Girl Make Disturbance - Sakshi

ఇంట్లో ఉండే చిన్న పిల్ల‌ల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. మ‌నం చేయాల‌నుకున్న ప‌నిని తెలిసి తెలియ‌ని త‌నంతో చెడ‌గొట్టాల‌ని అనుకుంటారు. వారు అనుకున్న‌ది సాధించ‌డం కోసం ఏదో ఒక తుంట‌రి ప‌నులు చేస్తుంటారు. కానీ వారు చేసే ప‌నులు కోపం కాకుండా న‌వ్వును తెప్పిస్తుంటాయి. తాజాగా అలాంటి ఘ‌ట‌నే ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.  (అర్జంట్ బాత్రూం: 185 కిమీ వేగంతో)

వివ‌రాలు... యోగా చేద్దామ‌ని కూతురికి తెలియ‌కుండా ఏకాంత ప్ర‌దేశానికి వ‌చ్చింది ఆ త‌ల్లి. కానీ త‌ల్లిన వెతుక్కుంటూ వెనుకే వ‌చ్చిన ఆ కూతురు త‌ల్లి చేస్తున్న యోగాను చెడ‌గొట్టే ప‌ని మొద‌లుపెట్టింది. జుట్టు లాగ‌డం, పైన ప‌డ‌డం, ముఖాన్ని ట‌చ్ చేయ‌డం ఇలా ఎన్ని చేసినా రాచెల్ క‌ళ్లు తెర‌వలేదు. ఇలా కాద‌ని అమ్మ‌ను వెనుక‌కు గ‌ట్టిగా తోస్తూ అరిచింది. దీంతో త‌ల్లి న‌వ్వు ఆపుకోలేక క‌ళ్లు తెరిచి పాపును గుండెకు హ‌త్తుకున్న‌ది. మొత్తానికి త‌ల్లి యోగాను చిన్నారి చెడ‌గొట్టానంటూ సంతోషం వ్య‌క్తం చేసింది.

'యోగా చేస్తే మ‌న‌సు ప్ర‌శాంతంగా ఉంటుందంటారు.. కానీ నా కూతురు ఆ అవ‌కాశం నాకు ఇవ్వ‌లేదు'  అనే  క్యాప్ష‌న్‌తో వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇప్ప‌టివ‌ర‌కు ఈ వీడియో 25 వేల‌కు పైగా లైకులు పొందింది.  'మీ ఇద్ద‌రి మ‌ధ్య నాకు చాలా ప్రేమ క‌నిపిస్తుంది'... 'కూతురు ముందు ఏ త‌ల్లైనా ఓడిపోవాల్సిందే ' అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement