పాక్ డబుల్ గేమ్పై యూఎస్ సీరియస్! | US lawmakers to debate whether Pak is a 'friend or foe' | Sakshi
Sakshi News home page

పాక్ డబుల్ గేమ్పై యూఎస్ సీరియస్!

Jul 9 2016 12:38 PM | Updated on Apr 4 2019 3:25 PM

ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్న పాకిస్తాన్ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని అమెరికా భావిస్తోంది.

వాషింగ్టన్: ఉగ్రవాదం విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్న పాకిస్తాన్ విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాలని అమెరికా భావిస్తోంది. ఈ మేరకు ఉగ్రవాదంపై పోరు విషయంలో.. పాకిస్తాన్ మిత్రువా లేక శత్రువా అనే విషయంపై చర్చ నిర్వహించాలని యూఎస్ చట్ట సభల ప్రతినిధులు నిర్ణయించారు. వచ్చేవారం ఈ సమావేశం నిర్వహించనున్నట్లు యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు, టెర్రరిజంపై ఏర్పాటు చేసిన సబ్ కమిటీ చైర్మన్ టెడ్ పోయ్ తెలిపారు.

తీవ్రవాదానికి వ్యతిరేకం అంటూ చెబుతూనే అంతర్గతంగా టెర్రరిస్టు సంస్థలతో సంబంధాలు నడుపుతున్న ఆ దేశ వైఖరిపై చర్చించడం వల్ల.. చట్ట సభల సభ్యులకు పాకిస్తాన్ విషయంలో అవలంభించాల్సిన విదేశీ విధానంపై స్పష్టత వస్తుందని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ మిలటరీ, ఇంటలిజెన్స్ విభాగాలు ఇప్పటికీ ఉగ్రవాదులతో సంబంధాలు కొనసాగిస్తున్నాయని మరో సభ్యుడు సల్మొన్ తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement