యెమెన్ లో అమెరికా దాడులు | US attacks in Yemen | Sakshi
Sakshi News home page

యెమెన్ లో అమెరికా దాడులు

Jan 30 2017 3:14 AM | Updated on Sep 15 2018 7:57 PM

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణం చేసిన తర్వాత తొలిసారిగా ఓ దేశం (యెమెన్ )పై ఆ దేశ భద్రతా దళాలు దాడులకు పాల్పడ్డాయి.

41 మంది ఉగ్రవాదులు సహా 57 మంది మృతి
అదెన్ : అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రమాణం చేసిన తర్వాత తొలిసారిగా ఓ దేశం (యెమెన్ )పై ఆ దేశ భద్రతా దళాలు దాడులకు పాల్పడ్డాయి. యెమెన్ లో జరిగిన ఈ దాడుల్లో 41 మంది అనుమానిత అల్‌కాయిదా ఉగ్రవాదులు, 16 మంది సాధారణ పౌరులు మృతి చెందినట్లు ఆ దేశ అధికార వర్గాలు వెల్లడించాయి.

బైదా సెంట్రల్‌ ప్రావిన్స్ లోని యక్లా జిల్లాలో జరిగిన ఈ దాడుల్లో 8 మంది మహిళలు, 8 మంది చిన్నపిల్లలు సహా మొత్తం 57 మంది మృత్యువాత పడ్డారు. అల్‌కాయిదా బడులు, మసీదులు, వైద్య ప్రాంతాల్లో కూడా దాడులు నిర్వహించారు. ఈ ప్రాంత అల్‌కాయిదా చీఫ్‌ అబు బరాజన్  కూడా దాడుల్లో చనిపోయినట్లు అధికారులు చెప్పారు. దాడుల్లో తమ సైనికుడు ఒకరు మృతి చెందాడని అమెరికా పేర్కొంది.గత 24 గంటల్లో 100 మంది రెబల్స్‌ను హతమార్చామని యెమెన్‌ ఆర్మీ చెప్పింది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement