విమానం నేలకూల్చేందుకు కుట్ర | Terrorist Plot to Bring Down Airplane Foiled, Says Australian PM | Sakshi
Sakshi News home page

విమానం నేలకూల్చేందుకు కుట్ర

Jul 30 2017 8:48 AM | Updated on Sep 5 2017 5:13 PM

విమానం నేలకూల్చేందుకు కుట్ర

విమానం నేలకూల్చేందుకు కుట్ర

విమానంపై ఉగ్రదాడి కుట్రను ఆస్ట్రేలియా పోలీసులు భగ్నం చేశారు.

కాన్‌బెర్రా: విమానంపై ఉగ్రదాడి కుట్రను ఆస్ట్రేలియా పోలీసులు భగ్నం చేశారు. సిడ్నీ సబర్బన్‌లో పలు చోట్ల దాడులు చేసిన పోలీసులు కుట్ర పన్నిన ఉగ్రవాదులను ఆదివారం అరెస్టు చేశారు. ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మాల్కమ్‌ టర్నబుల్‌ ఓ ప్రకటన చేశారు.

గురువారం నుంచి సిడ్నీ ఎయిర్‌పోర్టులో భద్రతను పెంచామని, అందుకు కారణం ఉగ్రదాడి జరుగుతుందని ఇంటిలిజెన్స్‌ రిపోర్టులు అందడమేనని తెలిపారు. మిగిలిన ఎయిర్‌పోర్టుల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేసినట్లు వెల్లడించారు. ఇప్పటివరకూ నలుగురిని అరెస్టు చేశారని, మిగిలిన వారి కోసం పోలీసులు జల్లెడ పడుతున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement