ఖషోగ్గీ ఎమయ్యాడో తెలీదు: సౌదీ రాజు | Saudi Could Admit Jamal Khashoggi Died During Interrogation | Sakshi
Sakshi News home page

ఖషోగ్గీ ఎమయ్యాడో తెలీదు: సౌదీ రాజు

Oct 16 2018 4:57 AM | Updated on Oct 23 2018 8:27 PM

Saudi Could Admit Jamal Khashoggi Died During Interrogation - Sakshi

దుబాయ్‌: వాషింగ్టన్‌ పోస్ట్‌ కంట్రిబ్యూటర్‌ జమాల్‌ ఖషోగ్గీ కనిపించకుండా పోవడంపై సౌదీ అరేబియాపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో రాజు సల్మాన్‌ రంగంలోకి దిగారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఖషోగ్గీ ఏమమయ్యాడో తమకు తెలియదని చెప్పారు. సౌదీ పౌరుడైన ఖషోగ్గీ అమెరికాలోఉంటూ సౌదీపై వాషింగ్టన్‌ పోస్ట్‌లో విమర్శనాత్మక కథానాలు రాసేవారు.

ఈ నెల 2న టర్కీలోని ఇస్తాంబుల్‌లో ఉన్న సౌదీ ఎంబసీలోపలికెళ్లిన తర్వాత ఆయన కనిపించకుండా పోవడం, ఆయనను సౌదీనే హత్య చేసిందని ఆరోపణలు రావడం తెల్సిందే. సౌదీలో రాజకుటుంబానికి మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే వ్యతిరేక పోస్ట్‌లు కూడా వస్తున్నప్పటికీ వాటిని సౌదీ ప్రభుత్వం వెంటనే తొలగిస్తోందని తెలుస్తోంది. ఇస్తాంబుల్‌లోని సౌదీ ఎంబసీలో ఖషోగ్గీ అదృశ్యంపై టర్కీ పోలీసులు అక్కడ సోదాలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement