రన్‌వే మీద రైల్వే లైన్.. | Railway line on the runway | Sakshi
Sakshi News home page

రన్‌వే మీద రైల్వే లైన్..

Aug 8 2016 1:32 AM | Updated on Sep 4 2017 8:17 AM

రన్‌వే మీద రైల్వే లైన్..

రన్‌వే మీద రైల్వే లైన్..

ఇది గ్రాఫిక్ చిత్రం కాదు.. అసలైనదే.. న్యూజిలాండ్‌లోని గిస్‌బార్న్ ఎయిర్‌పోర్టులో నిజంగానే ఇలా రైళ్లు వెళ్లివస్తుంటాయి.

ఇది గ్రాఫిక్ చిత్రం కాదు.. అసలైనదే.. న్యూజిలాండ్‌లోని గిస్‌బార్న్ ఎయిర్‌పోర్టులో నిజంగానే ఇలా రైళ్లు వెళ్లివస్తుంటాయి. ఈ చిన్నస్థాయి ఎయిర్‌పోర్టు 160 హెక్టార్ల పరిధిలో ఉంది. ఇందులో ప్రధాన రన్‌వేతోపాటు మూడు చిన్న రన్‌వేలు ఉన్నాయి. ప్రధాన రన్‌వేకు మధ్యలో నుంచి ఈ రైల్వే లైను ఉంది. దీని వల్ల రైలు వచ్చినప్పుడు.. గేటు వద్ద మనమెలా ఆగుతామో.. అక్కడ విమానాలు కూడా ఆగుతాయట. లేదా విమానమే ముందు వెళ్లేటట్లుంటే.. రైలును ఆపుతారట. ఈ రెండింటినీ బాలెన్స్ చేయడంతోనే ఎయిర్‌పోర్టు సిబ్బందికి రోజంతా సరిపోతుందట.

Advertisement
 
Advertisement
Advertisement