అప్పుడే పుట్టిన శిశువుకి కరోనా లక్షణాలు

New Born Baby Diagnosed With Corona Virus In London Hospital - Sakshi

కరోనా వైరస్ పంజా విసురుతోంది. అప్పుడే పుట్టిన పిల్లలను కూడా వదలడం లేదు. ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే వందలాది మంది ప్రాణాలను బలిగొన్న కరోనా వైరస్‌.. తాజాగా పుట్టిన కొన్ని గంటలకే లండన్‌ నగరంలోని నార్త్‌ మిడిలెక్స్‌ ఆస్పత్రిలోని ఓ చిన్నారికి ఈ వైరస్‌ సోకింది. కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కాగా ఆ శిశువు ప్రపంచంలో కరోనా వైరస్‌ సోకిన అతిచిన్న వయస్కురాలిగా నమోదైంది.

శిశువు తల్లి గత కొన్ని రోజులుగా న్యుమోనియాతో నార్త్‌మిడిలెక్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని తెలిసింది. ప్రసవం జరిగిన వెంటనే శిశువుకు నిర్వహించిన వైద్యపరీక్షలో కరోనావైరస్‌ ఉన్నట్లు బయటపడింది. ఈ వైరస్‌ తల్లి గర్భంలో ఉన్నప్పుడు సోకిందా, లేక పుట్టిన వెంటనే సోకిందా అన్న కోణంలో వైద్యులు నిర్ధారించడానికి ప్రయత్నిస్తున్నారు. తల్లి, బిడ్డ ఇద్దరిని వేర్వేరు ఆస్పత్రుల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా.. శనివారం నాటికి యూకేలో కరోనా వైరస్‌ సోకిన కేసుల సంఖ్య 798కి చేరుకోగా, 10 మంది మృతి చెందారు. చదవండి: కరోనా మృతదేహాలను ఏం చేస్తున్నారంటే..!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top