హెచ్1బీ ఉద్యోగుల వేతనాలపై షాకింగ్ రిపోర్టు 

 Most H 1B employers use programme to pay migrant workers well below market wages:Report - Sakshi

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిన కొత్త  వీసా సంస్కరణలు, తాజాగా కరోనా వైరస్ సంక్షోభంతో  ఐటీ నిపుణులు ఇబ్బందుల్లో పడిన సమయంలో  హెచ్ 1 బీ వీసాదారుల వేతనాలకు సంబంధించి షాకింగ్ రిపోర్టు వెలుగులోకి వచ్చింది. ప్రధాన దిగ్గజ కంపెలన్నీ తక్కువ (స్థానిక మధ్యస్థ) వేతనాలను చెల్లించాయని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.  ప్రధాన అమెరికన్ టెక్నాలజీ సంస్థలైన ఫేస్‌బుక్, గూగుల్, ఆపిల్, మైక్రోసాఫ్ట్  సహా ఇతర దిగ్గజ  కంపెనీలు  హెచ్ 1 బీ నిపుణులకు మార్కెట్ వేతనాల కంటే తక్కువ చెల్లించాయని తాజా నివేదిక పేర్కొంది.

హెచ్ 1 బీ వీసాదారులను కలిగిన టాప్ 30 అమెరికా కంపెనీల్లో అమెజాన్, మైక్రోసాఫ్ట్, వాల్మార్ట్, గూగుల్, ఆపిల్, ఫేస్ బుక్ సహా ప్రధాన సంస్థలు ఇందులో ఉన్నాయి. వీరందరూ హెచ్ 1బీ  ఉద్యోగుల్లో చాలామందికి స్థానిక సగటు కంటే తక్కువ జీతాలను చెల్లించాయట. స్థానిక వేతనాల కంటే తక్కువ జీతాల చెల్లింపుపై చట్టబద్ధంగా ఉన్న ప్రోగ్రామ్ నిబంధనలను ఉపయోగించుకుని ఇలా చేశాయని ఎకనామిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన నివేదిక తెలిపింది. (హెచ్‌1బీ వీసాదారులకు ఊరట)

"హెచ్ 1 బీ వీసాలు , ప్రస్తుత వేతన స్థాయిలు" అనే  పేరుతో  డేనియల్ కోస్టా , రాన్ హీరా వెల్లడించిన ఈ నివేదిక ప్రకారం, యుఎస్ కార్మిక శాఖ (డీఓఎల్) ధృవీకరించిన 60 శాతం హెచ్1బీ  వీసాదారులకు స్థానిక మధ్యస్థ వేతనాని కంటే చాలా తక్కువ వేతన స్థాయిలను అందించాయి. అంతేకాదు ఈ నిబంధనలను మార్చే అధికారం డీఓఎల్ కు  ఉన్నప్పటికీ అలా చేయలేదని పేర్కొన్నారు.  2019 లో 53వేలకు పైగా కంపెనీలు హెచ్ 1బీ ప్రోగ్రామ్‌ను ఉపయోగించగా, 2019 లో యుఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఆమోదించిన 389,000 హెచ్ 1బీ  ఉద్యోగుల టాప్ 30 కంపెనీలు నాలుగింటిలో ఒకటి ఉంది.  టాప్ 30 కంపెనీల్లో సగానికి పైగా అత్యధిక ఉద్యోగులను అవుట్ సోర్సింగ్ ద్వారానే నియమించుకుంటున్నాయన్నారు. అయితే టెక్ కంపెనీలు నేరుగా నియమించుకుంటున్నా వేతనాలు మాత్రం లెవల్ 1, లేదా లెవల్ 2  స్థాయిలోనే ఉన్నాయని నివేదించారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top