జైషే చీఫ్‌ మసూద్‌ అజర్‌కు ఏమైంది.? | Masood Azhar InjuredIn Rawalpindi Hospital Blast | Sakshi
Sakshi News home page

పేలుళ్లలో జైషే చీఫ్‌ మసూద్‌ అజర్‌కు గాయాలు

Jun 25 2019 10:11 AM | Updated on Jun 25 2019 10:13 AM

Masood Azhar InjuredIn Rawalpindi Hospital Blast - Sakshi

పేలుళ్లలో జైషే చీఫ్‌ మసూద్‌ అజర్‌కు గాయాలు

న్యూఢిల్లీ : రావల్పిండి ఆస్పత్రిలో సోమవారం జరిగిన పేలుళ్లలో గాయపడిన పదిమందిలో జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ ఉన్నట్టు భావిస్తున్నారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న మసూద్‌ అజర్‌ ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఈ ఘటనపై పాకిస్తాన్‌ పెదవివిప్పడం లేదు. మరోవైపు భారత నిఘా సంస్ధలు సైతం ఈ విషయాన్ని ఇంతవరకూ ధ్రువీకరించలేదు. 

కాగా, ఓ స్ధానిక చానెల్‌ రావల్పిండి ఆస్పత్రిలో జరిగిన పేలుడులో అజర్‌ సహా పది మంది గాయపడ్డారని వెల్లడించడం గమనార్హం. పాకిస్తాన్‌ సైన్యం నిర్వహించే ఈ ఆస్పత్రికి అజర్‌ తరచూ డయాలసిస్‌ చేయించుకునేందుకు వెళతారని చెబుతున్నారు. మరోవైపు ఆస్పత్రిలో జరిగిన భారీ పేలుడులో గాయపడిన వారిని ఎమర్జెన్సీకి తరలించారని ట్విటర్‌ యూజర్‌ అషన్‌ ఉలా మియాఖల్‌ పోస్ట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement