గతేడాది రాహుల్, ప్రియాంకలను కలిశా: మోదీ | last year i met UPA heads while they are ruling, says lalit modi | Sakshi
Sakshi News home page

గతేడాది రాహుల్, ప్రియాంకలను కలిశా: మోదీ

Jun 26 2015 11:51 AM | Updated on Sep 3 2017 4:25 AM

గతేడాది రాహుల్, ప్రియాంకలను కలిశా: మోదీ

గతేడాది రాహుల్, ప్రియాంకలను కలిశా: మోదీ

ఐపీఎల్ కుంభకోణం వివాదంలో చిక్కుక్కున్న మాజీ చైర్మన్ లలిత్ మోదీ మరికొన్ని విషయాలు వెల్లడించాడు.

న్యూఢిల్లీ : ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ నుంచి మరో బుల్లెట్ వెలువడింది. ఎవరెవరు తనను కలిసింది, ఎక్కడ సమావేశమైంది తదితర విషయాలను ట్విట్టర్ ద్వారా వెల్లడిస్తున్న లలిత్ మోదీ తాజాగా మరో కీలక విషయం వెల్లడించారు. తాను బీజేపీ నేతలను మాత్రమే కలవలేదని, కాంగ్రెస్ అగ్రనేతలతోనూ టచ్‌లో ఉన్నానని లలిత్ తెలిపారు.

 

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె-అల్లుడు ప్రియాంక రాబర్ట్‌వాధ్రాలను తాను కలుసుకున్నానని లలిత్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ తో  కూడా తాను భేటీ అయ్యానని లలిత్ తెలిపారు. గత ఏడాది లండన్‌లో ఆ ముగ్గురితో సమావేశం అయ్యానని తెలిపిన లలిత్ ఆ సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కారు కేంద్రంలో అధికారంలో ఉందని గుర్తు చేశారు. ఆనాటి సమావేశం గురించి ఆ ముగ్గురు వ్యక్తులు ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు.  తాను వారిని రెస్టారెంట్ లో కలుసుకున్నప్పుడు గాంధీ కుటుంబీకులతో పాటు టిమ్మీ సర్నా ఉన్నాడని, అతడితో తన కాంటాక్ట్ నంబర్ ఉందన్నాడు. అతడికి కాల్ చేస్తే నేను ఏ విధంగా స్పందించానన్నది తెలుస్తుందని రెండో ట్వీట్ లలో  మోదీ పేర్కొన్నాడు.

కాగా లలిత్ మోదీకి వీసా పత్రాలకు సాయం చేశారని కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేలు తమ పదవులకు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

 

Advertisement
 
Advertisement
Advertisement