ఒక్కడిని చంపినందుకు 30 మంది పౌరుల హత్య | Islamic State kills nearly 30 civilians abducted from remote province | Sakshi
Sakshi News home page

ఒక్కడిని చంపినందుకు 30 మంది పౌరుల హత్య

Oct 27 2016 2:42 AM | Updated on Sep 4 2017 6:23 PM

ఒక్కడిని చంపినందుకు  30 మంది పౌరుల హత్య

ఒక్కడిని చంపినందుకు 30 మంది పౌరుల హత్య

ఇస్లామిట్ స్టేట్ ఉగ్రవాదులు అఫ్గానిస్తాన్‌లో మరో దారుణానికి ఒడిగట్టారు. స్థానికుల సాయంతో తమ కమాండర్‌ను ప్రభుత్వ

అఫ్గాన్‌లో ఐసిస్ దారుణం

 కాబూల్: ఇస్లామిట్ స్టేట్ ఉగ్రవాదులు అఫ్గానిస్తాన్‌లో మరో దారుణానికి ఒడిగట్టారు. స్థానికుల సాయంతో తమ కమాండర్‌ను ప్రభుత్వ బలగాలు చంపాయనే ఆగ్రహంతో సుమారు 30 మంది అమాయక పౌరులను ఐసిస్ ఉగ్రవాదులు అపహరించి దారుణంగా హత్య చేశారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. ఈ ఘటన మంగళవారం సెంట్రల్ అఫ్గాన్‌లోని గోర్ ప్రావిన్స్‌లో జరిగింది. కాగా, ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఐసిస్ ఉగ్రవాద సంస్థ  ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

గోర్ గవర్నర్ నాసిర్ మాట్లాడుతూ.. మంగళవారం స్థానికుల సాయంతో భద్రతా బలగాలు ఐసిస్ కమాండర్‌ను హతమార్చాయని చెప్పారు. దీనికి ప్రతీకారంగా ఆ వెనువెంటనే సుమారు 30 మంది గ్రామస్తులను ఐసిస్ అపహరించిందన్నారు. వారిలో ఎక్కువ మంది గొర్రెల కాపరులున్నట్లు తెలిపారు. బుధవారం ఉదయం వారి మృతదేహాలను స్థానికులు సమీపంలో గుర్తించినట్లు చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement