యెమెన్‌లో భారతీయ ఫాదర్‌ను శిలువేశారు! | Indian priest Tom Unzhunnalil crucified | Sakshi
Sakshi News home page

యెమెన్‌లో భారతీయ ఫాదర్‌ను శిలువేశారు!

Mar 28 2016 7:39 PM | Updated on Sep 3 2017 8:44 PM

యెమెన్‌లో భారతీయ ఫాదర్‌ను శిలువేశారు!

యెమెన్‌లో భారతీయ ఫాదర్‌ను శిలువేశారు!

యెమెన్‌లో మూడు వారాల క్రితం కిడ్నాప్ చేసిన భారత్‌లోని బెంగళూరుకు చెందిన క్యాథలిక్ ఫాదర్ టామ్ ఉజున్నలీల్ (56)ను ఐసిస్ టైస్టులు శుక్రవారం ‘గుడ్ ఫ్రైడే’ రోజున శిలువేసి చంపేశారు.

సనా: యెమెన్‌లో మూడు వారాల క్రితం కిడ్నాప్ చేసిన భారత్‌లోని బెంగళూరుకు చెందిన క్యాథలిక్ ఫాదర్ టామ్ ఉజున్నలీల్ (56)ను ఐసిస్ టైస్టులు శుక్రవారం ‘గుడ్ ఫ్రైడే’ రోజున శిలువేసి చంపేశారు. ఈ విషయాన్ని వియన్నా ఆర్చిబిషప్ క్రిస్టఫ్ క్యథెడ్రల్ శ్యాన్‌బార్న్ ధ్రువీకరించారు. అయితే ఆయన ఈ విషయాన్ని ఎలా ధ్రువీకరించుకున్నారన్న విషయాన్ని వెల్లడించలేదు.
 

 మార్చి 4వ తేదీన ఏడెన్‌లో మదర్ థెరిస్సా క్రిస్టియన్ మిషనరీస్ నిర్వహిస్తున్న వృద్ధుల ఆశ్రమంలోకి సాయుధులైన నలుగురు ఐసిస్ టెర్రరిస్టులు జొరబడి ఫాదర్ టామ్ (థామస్)ను కిడ్నాప్ చేశారు. ఈ సందర్భంగా టెర్రరిస్టులు జరిపిన కాల్పుల్లో భారత్‌కు చెందిన నలుగురు నన్స్, ఇద్దరు యెమెన్ స్టాఫ్, ఎనిమిది మంది వృద్ధులు, ఓ గార్డు మరణించారు. కిడ్నాప్ చేసి తమ వెంట తీసుకెళ్లిన భారతీయ ఫాదర్ టామ్‌ను గుడ్‌ఫ్రై రోజున శిలువేసి చంపేస్తామని కూడా టెర్రరిస్టులు ముందుగానే హెచ్చరించారట.

Advertisement
 
Advertisement
Advertisement