నుదిటి మీద ముడతలు చెప్పే రహస్యం

Forehead Wrinkles Sign For Cardiovascular Disease Says Studies - Sakshi

పారిస్‌ : సాధారణంగా నుదిటి మీద ముడతలు ఎక్కువవుతుంటే ఏమనిపిస్తుంది?.. వయస్సు పెరుగుతోంది కదా! ముడతలు సహజమే.. అనుకుంటాం. కానీ నుదిటి మీద ముడతలకు కేవలం వయస్సుతోనే కాకుండా గుండె జబ్బులకు కూడా సంబంధం ఉందంటున్నారు పరిశోధకులు. నుదిటి మీద ముడతలు గుండె జబ్బులకు సూచనలుగా భావించవచ్చంటున్నారు. ఎక్కువ ముడతలు ఉన్నవారు కార్డియోవాస్క్యులర్‌ డిసీస్‌తో మరణించే అవకాశాలు ఎక్కువని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.   ఫ్రాన్స్‌కు చెందిన ‘‘హాస్పిటల్ యూనివర్సరీ డే టౌలౌస్’’ ప్రోఫెసర్‌ ‘యోలాండ్ ఎస్క్విరోల్’ జరిపిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 

జీవనశైలిలో మార్పులు చేయటం ద్వారా కార్డియోవాస్క్యులర్‌ను నియంత్రించవచ్చని యోలాండ్‌ తెలిపారు. వయసు పెరిగేకొద్ది గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నా ఆహారపు అలవాట్లు, సరైన మందులను వాడటం ద్వారా ప్రమాదాన్ని తగ్గించవచ్చని అన్నారు. యోలాండ్ ఎస్క్విరోల్ బృందం వివిధ వయస్సులకు చెందిన 3200 మందిపై 20 ఏళ్ల పాటు పరిశోధనలు జరిపింది. వారిలో ఇప్పటి వరకు 244 మంది వివిధ కారణాలతో చనిపోయారు. అయితే వారిలో నుదిటిపై ముడతలు లేని వారి కంటే ఉన్నవారు ఎక్కుగా గుండె సంబంధ జబ్బులతో చనిపోయినట్లు తేలింది. రెండు అంతకంటే ఎక్కువ ముడతలు ఉన్నవారు ముడతలు లేని వారికంటే పదిరెట్లు తొందరగా చనిపోయినట్లు వెల్లడైంది.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top